Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా… జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Upcoming K-Dramas : ఇప్పుడు కొరియన్ సిరీస్ లకు ఉన్న ఆదరణ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడ చూసినా వీటి ఆదరణ పేరుగుతుందే తప్ప, ఏమాత్రం తగ్గట్లేదు. ఇక వీటిలో రొమాంటిక్ సిరీస్ లను అస్సలు వదిలిపెట్టడం లేదు ప్రేక్షకులు. మనవాళ్లయితే సీరియల్స్ కి బదులు వీటితోనే ఎక్కువ కాలక్షేపం చేస్తున్నారు. మేకర్స్ కూడా ఆడియన్స్ కి తగ్గట్టే మంచి కంటెంట్ ఉన్న సిరీస్ లను రిలీజ్ చేస్తున్నారు. ఈ జూన్ 2026లో కొరియన్ డ్రామా అభిమానుల కోసం రొమాన్స్, యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్లతో కూడిన సరికొత్త సిరీస్‌లు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలవుతున్నాయి. ఇక వీటిని చూస్తూ, ఫ్యాన్స్ సంబరంలో మునిగిపోతారనడంలో సందేహం లేదు.
1. Doctor on the Edge (డాక్టర్ ఆన్ ది ఎడ్జ్)
‘ఎండ్యూరెన్స్ డాక్టర్’ అనే వెబ్‌టూన్ ఆధారంగా తెరకెక్కిన మెడికల్ రొమాంటిక్ కామెడీ ఇది. ఒక ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ మిలిటరీ సర్వీస్‌లో భాగంగా ఒక మారుమూల ద్వీపానికి పబ్లిక్ హెల్త్ డాక్టర్‌గా వెళ్తాడు. అక్కడ ఒక నర్సును కలుసుకున్న తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేది ఈ కథ. లీ జే-వుక్, షిన్ యే లీడ్ రోల్స్ లో నటించిన ఈ సిరీస్ 2026 జూన్ 1నుంచి ENA, జియో హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read
2. Teach You A Lesson (టీచ్ యు ఎ లెసన్)
కిమ్ మూ-యుల్, లీ సుంగ్-మిన్, జిన్ కి-జూకథ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఒక హై-వోల్టేజ్ యాక్షన్ స్కూల్ డ్రామా. పాఠశాలల్లో పెరిగిపోతున్న హింస, ర్యాగింగ్‌లను అరికట్టడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తుంది. ఆకతాయిలను ఈ బృందం ఎలా అణచివేసిందనేది ఈ డార్క్ సిరీస్ కథాంశం. 2026 జూన్ 5 నుంచి Netflixలో ఇది అందుబాటులోకి రానుంది.
3. The Lie We Lived In (ది లై వి లివ్డ్ ఇన్)
ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా. అంతేకాదు ఇద్దరు అబ్బాయిలు ప్రేమలో పడే క్రేజీ సిరీస్ కూడా. ఒక యువకుడిని చంపే కాంట్రాక్ట్ తీసుకున్న ప్రొఫెషనల్ కిల్లర్ ప్లాన్, ఒక డిటెక్టివ్ ఎంట్రీతో పూర్తిగా తలకిందులవుతుంది. వారిద్దరి మధ్య ఏర్పడే ఆకర్షణతో కథ ఊహించని టర్న్ తీసుకుంటుంది. కిమ్ సంగ్-బియోమ్, కిమ్ గ్యోంగ్-మిన్, లీ జియాంగ్-హో ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ 2026 జూన్ 5 నుంచి Rakuten Viki, Wavve ఓటీటీలలో స్ట్రీమింగ్ లో ఉంటుంది.
4. See You at Work Tomorrow! (సీ యూ ఎట్ వర్క్ టుమారో!)
ఆఫీస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే స్లో-బర్న్ రొమాంటిక్ కామెడీ ఇది. కెరీర్లో విసిగిపోయి, ప్రేమకు దూరంగా ఉండే ఒక ప్రొడక్ట్ ప్లానర్, ఆఫీసులో అత్యంత కఠినంగా ఉండే తన కొత్త బాస్‌తో కలిసి పనిచేయాల్సి వస్తుంది. వీరిద్దరి మధ్య మొదట వచ్చే గొడవలు మెల్లగా ఎలా ప్రేమగా మారాయనేది ఆసక్తికరంగా చూపిస్తారు. ఇందులో సియో ఇన్-గుక్, పార్క్ జి-హ్యూన్, కాంగ్ మి లీడ్ రోల్స్ లో నటించారు. జూన్ 22 నుంచి ఇది Amazon Prime Videoలో అందుబాటులో ఉంటుంది.
5. Notes from the Last Row (నోట్స్ ఫ్రమ్ ది లాస్ట్ రో)
ఇది ఒక మైండ్-బెండింగ్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్. ఒక లిటరేచర్ ప్రొఫెసర్, తన క్లాసులో చివరి బెంచీలో కూర్చునే ఒక విద్యార్థిలో అద్భుతమైన రైటింగ్ టాలెంట్‌ను గుర్తిస్తాడు. ఆ స్టూడెంట్ రాసే కథలు వారి చుట్టూ ఉన్న నిజ జీవిత సంఘటనలను పోలి ఉండటంతో, వారిద్దరి మధ్య మొదలైన సీక్రెట్ సెషన్స్ ప్రమాదకరమైన మలుపులు తిరుగుతాయి. 2026 జూన్ 26 నుంచి ఇది Netflix లో స్ట్రీమింగ్ కాబోతోంది.
6. Agent Kim Reactivated (ఏజెంట్ కిమ్ రీయాక్టివేటెడ్)
‘మేనేజర్ కిమ్’ అనే పాపులర్ వెబ్‌టూన్ ఆధారంగా తెరకెక్కిన పక్కా యాక్షన్ రివెంజ్ డ్రామా ఇది. గతంలో ఒక ఎలైట్ కోవర్ట్ ఏజెంట్‌గా (కోడ్ నేమ్ 66) పనిచేసి, ప్రస్తుతం ఒక బ్యాంక్ మేనేజర్‌గా, ఒంటరి తండ్రిగా జీవిస్తున్న వ్యక్తి కథ ఇది. ఒకరోజు అతని కూతురిని ఎవరో కిడ్నాప్ చేయడంతో, మళ్లీ పాత ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టి రౌడీల ఆట ఎలా కట్టించాడనేది కథ. ‘జాన్ విక్’ తరహా యాక్షన్ ఇష్టపడేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. జూన్ 26 నుంచి ఇది Netflixలో అందుబాటులోకి రానుంది.
తాజావార్తలు
-
Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!