Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
- 5 రాష్ట్రాల్లో ఏకకాలంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో దాడులు
- మ్యూల్ ఖాతాలు, నకిలీ కేవైసీ పత్రాల దందా గుట్టురట్టు
- డెబిట్ కార్డులు, పాస్‌బుక్కులు, సిమ్ కార్డులు స్వాధీనం
- ట్రాన్సిట్ వారెంట్లతో నిందితులను హైదరాబాద్‌కు తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ భారతదేశంలో సైబర్ నేరగాళ్ల మూలాలను పెకలించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు బృహత్తర ఆపరేషన్‌ను సఫలీకృతం చేశారు. గత రెండు వారాలుగా అత్యంత రహస్యంగా సాగిన ఈ ఆపరేషన్‌లో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని పలు కీలక ప్రాంతాల్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. ఈ దాడులలో సైబర్ నేరగాళ్లకు ప్రధాన ఆసరాగా నిలుస్తున్న ఏజెంట్లు, ముఠా సభ్యులతో సహా మొత్తం 100 మందికి పైగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మ్యూల్ ఖాతాలు, కేవైసీ పత్రాల దందా గుట్టు రట్టు
సైబర్ మోసాలకు పాల్పడే సూత్రధారులకు ఇతరుల పేర్లతో ఉండే ‘మ్యూల్ ఖాతాలు’ (Mule Accounts) సమకూర్చడం, అందుకు అవసరమైన నకిలీ కేవైసీ (KYC) పత్రాలను అందించడమే లక్ష్యంగా ఈ ముఠాలు పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. అమాయకులైన పౌరుల నుంచి వివిధ ప్రలోభాలతో కేవైసీ పత్రాలను సేకరించి, వాటి ద్వారా బ్యాంకు ఖాతాలు తెరిచి సైబర్ ముఠాలకు విక్రయిస్తున్న ఏజెంట్లను అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితుల వద్ద నుంచి భారీ సంఖ్యలో మ్యూల్ ఖాతాలకు సంబంధించిన డెబిట్ కార్డులు, బ్యాంకు పాసు పుస్తకాలు, చెక్ బుక్కులు , చెల్లుబాటులో ఉన్న సీమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
- Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
- Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
- Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు నిందితుల తరలింపు
పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళలో పట్టుబడిన ప్రధాన నిందితులను ఆయా స్థానిక న్యాయస్థానాల్లో హాజరుపరిచిన పోలీసులు ట్రాన్సిట్ వారెంట్లు సాధించారు. అనంతరం వారిని భారీ భద్రత నడుమ తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఈ ఆపరేషన్ ద్వారా దేశవ్యాప్తంగా సాగుతున్న పలు పెద్ద సైబర్ మోసాల వెనుక ఉన్న ముఠాల లింకులు బయటపడే అవకాశం ఉందని, హైదరాబాద్‌లోని బ్యూరో కార్యాలయంలో నిందితులను సుదీర్ఘంగా విచారించి తదుపరి చట్టపరమైన చర్యలు వేగవంతం చేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!