అయితే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా మాత్రం యాక్షన్ సన్నివేశాలు లేకుండానే తెరకెక్కింది.ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం అందుకుంటుందో తెలియాలంటే శుక్రవారం వరకు ఆగాల్సిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.ప్రముఖ క్రిటిక్స్ లో ఒకరైన ఉమైర్ సంధు రాధేశ్యామ్ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు. అసలు సిసలైన సినిమా అంటే రాధేశ్యామ్ అని కొనియాడారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఊహించని విధంగా వైవిధ్యంగా ఉందన్నారు.
ఈ సినిమాలో ఉపయోగించిన గ్రాఫిక్స్ ప్రత్యేకమైనవని, డార్లింగ్ ప్రభాస్, పూజాహెగ్డేల మధ్య కెమిస్ట్రీ మామూలుగా లేదంటూ ఆయన తెలిపారు. ఈ సినిమా కథ ఇంతవరకు చూడని విధంగా ఉంటుందని, క్లాస్, స్టయిల్ లో ప్రభాస్ ను కొట్టే మొనగాడు ఇండియాలో మరెవ్వరూ లేరని ఉమైర్ సంధూ ఆకాశానికెత్తేశాడు. రాధేశ్యామ్ లో అత్యంత ఆకర్షణీయంగా కనిపించాడని, ఈ చిత్రంలో అతడి నటన, ఆహార్యం తనను విపరీంగా ఆకట్టుకున్నాయని వివరించారు.