Allari Naresh: నరేశ్, విజయ్ కనకమేడల కాంబోలో ‘ఉగ్రం’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో ‘అల్లరి’ నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్ లో వచ్చిన ‘నాంది’ చిత్రం కమర్షియల్ సక్సెస్ అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ముఖ్యంగా ‘అల్లరి’ నరేష్ ఈ చిత్రాన్ని తన సరికొత్త ఇన్నింగ్స్ కు నాందిగా భావించారు. వీరిద్దరూ కలిసి తమ రెండో సినిమా కోసం చేతులు కలిపారు. ఇటీవలే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. తాజాగా సోమవారం రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఫస్ట్ షాట్‌కు ‘దిల్’ రాజు క్లాప్ కొట్టగా, దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచాన్ చేశారు. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకుడు విజయ్ తల్లిదండ్రులు లోకేశ్వరి, రామకోటేశ్వరరావు స్క్రిప్ట్‌ను అందజేశారు.
Also Read
- Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
- NBK111 : బాలయ్య - గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
- Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
- Dharman : రజనీకాంత్ - రామ్ పోతినేని 'ధర్మన్' సంక్రాంతి రిలీజ్?


టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా మేకర్స్ సోమవారం విడుదల చేశారు. న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండే ఈ చిత్రానికి ‘ఉగ్రం’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో ‘అల్లరి’ నరేష్ ఆవేశంతో అరుస్తుండగా, అతని వెనుక భాగంలో కత్తిపోటు, శరీరమంతా గాయాలు ఉన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ ‘ఉగ్రం’ టైటిల్ కు సరైన జస్టిఫికేషన్ ఇచ్చింది. టైటిల్ ని రెడ్ కలర్‌తో డిజైన్ చేయడం ఇంట్రస్టింగా వుంది. ‘కృష్ణార్జున యుద్ధం, మజిలీ, గాలి సంపత్, టక్ జగదీష్’ వంటి పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులను నిర్మించిన నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం 5గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలో కనిపించనున్నారు. దీనికి తూము వెంకట్ కథను అందించగా, అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, సిద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్. వచ్చే నెలలో ‘ఉగ్రం’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!