అక్కినేని హీరోగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు నాగచైతన్య. తన నటనతో ప్రేక్షకులను ఎంతో మెప్పిస్తున్నాడు, కానీ ఒక కమర్షియల్ హిట్ కూడా ఆయన ఖాతాలో పడకపోవడం ఆశ్చర్యం అనే చెప్పాలి. ఇప్పటివరకు ఎన్నో ఫీల్ గుడ్ చిత్రాలలో నటించాడు కానీ ఒక్క సక్సెస్ కూడా లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. శోభితాను వివాహం చేసుకోక ముందు నుండి కూడా ఆయన ఫేల్యూర్ లోనే ఉన్నాడు.. సమంతతో విడిపోయిన ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఇటు వ్యక్తిగతంగా అటు కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాడు చైతూ.
Also Read: Pushpalatha: సీనియర్ నటి పుష్పలత కన్నుమూత..
కానీ ఇప్పుడు చై లో కొంత మార్పు వచ్చింది శోభిత తో హ్యాపి లైఫ్ లీడ్ చేస్తూ.. ఇటు కెరీర్ పరంగా ‘తండేల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నాగచైతన్య.సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 7వ విడుదల కానుంది. ఇప్పటికే భారీ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రం, విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో, వరుస ప్రమోషన్స్ చేస్తుంది. రీసెంట్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంత సక్సెస్ అయిందో చూశాం. ఇందులో భాగంగా తాజాగా నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో నిజమైన ప్రేమ గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
నాగచైతన్య మాట్లాడుతూ.. ‘ఒక నిజమైన ప్రేమలో చాలా బాధ ఉంటుంది. మీరు ఆ బాధను అనుభవించిన తర్వాత దాని నుండి బయటపడినప్పుడు, అది సంబంధాన్ని చాలా భిన్నమైన రీతిలో బంధిస్తుంది. అలాంటి ఒక ప్రయాణాన్ని ఈ సినిమాలో చూస్తారు. కచ్చితంగా మీకు నచ్చుతుంది’ అంటూ కామెంట్లు చేశారు. మరి నాగచైతన్య ఈ మాటలు తన వ్యక్తిగత జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నారా? లేక సినిమాలో కథను దృష్టిలో పెట్టుకొని అన్నారా అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ప్రజంట్ న్యూస్ వైరల్ అవుతుంది.