Pushpalatha: సీనియర్ నటి పుష్పలత కన్నుమూత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత రెండేళ్లుగా ఇండస్ట్రీలో వరుసగా విషాదలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు రకరకాల కారణాల వల్ల మరణించారు. అయితే తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ సీనియర్ నటి పుష్పలత కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో 87 ఏళ్ల పుష్పలత మంగళవారం రాత్రి చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచింది. ఈ విషయం తెలిసిన చాలామంది ప్రముఖ నటీనటులు సంతాపం తెలుపుతున్నారు.
Also Read:Shriya Saran: సూర్య ‘రెట్రో’ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం టాలీవుడ్ స్టార్ హీరోయిన్
Also Read
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
కెరీర్ పరంగా భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, మలయాళం అలాగే కన్నడ భాషల్లో 100కు పైగా సినిమాలు చేసింది పుష్పలత.ఎన్టీఆర్ హీరోగా కోవెలమూడి భాస్కర్ రావ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చెరపకురా.. చెడేవు’ అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తమిళ సినిమాలో ప్రముఖ హీరోలైన ఎంజిఆర్, శివాజీ గణేషన్, జైశంకర్, జెమినీ గణేషన్ లతో కలిసి నటించింది. అనంతరం తెలుగు ఇండస్ట్రీలో ఆ తర్వాత ఆడబిడ్డ, మా ఊరిలో మహాశివుడు, వేటగాడు, ఆటగాడు, ఘరానా దొంగ, రక్త బంధం, శూలం, కొండవీటి సింహం, ఇద్దరు కొడుకులు, ప్రతిజ్ఞ, మూగవాని పగ, ఉక్కుమనిషి, రంగూన్ రౌడీ, విక్రమ్ వంటి చిత్రాలలో నటించి తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
ఇక వ్యక్తిగత విషయానికి వస్తే 1963లో ఎ. వి. ఎం. రాజన్ నటించిన ‘నానుమ్ ఒరు పెన్’ చిత్రంలో నటించిన పుష్పలత ఆ సినిమా షూటింగ్ సమయంలో నటుడు రాజన్ తో ప్రేమలో పడింది. ఆ తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇందులో ఒక కూతురు హీరోయిన్ గా రాణించింది.
తాజావార్తలు
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
-
OTR: వివాదాస్పదంగా తంబళ్ళపల్లె టీడీపీ ఇన్చార్జి వైఖరి..
-
Jadal Look: “మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా”.. ‘ది ప్యారడైజ్’ లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
-
Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!