సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో ఇప్పటివరకూ రెండు సినిమాలు వచ్చాయి. అతడు, ఖలేజ సినిమాలు ఫాన్స్ ని సాటిస్ఫై చేశాయి కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం వీక్ గానే ఆడాయి. టాలీవుడ్ లో కల్ట్ స్టేటస్ అందుకున్న ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తీసుకోని రాలేకపోయిన రిజల్ట్ ని ఈసారి సాలిడ్ గా సొంతం చేసుకోవడానికి రెడీ అయ్యారు మహేశ్ అండ్ త్రివిక్రమ్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా ‘SSMB 28’ అనౌన్స్ అయ్యింది. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీపై ఘట్టమనేని అభిమానుల్లోనే కాదు రెగ్యులర్ ఫిల్మ్ లవర్స్ లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి. పూజా హెగ్డే, శ్రీలీలా హీరోయిన్లుగా నటిస్తున్న ‘SSMB 28’ ప్రస్తుతం షెడ్యూల్ బ్రేక్ లో ఉంది. మహేశ్ బాబు ఫ్యామిలీతో ఫారిన్ వెకేషన్ లో ఉన్నాడు. సమ్మర్ హాలీడేస్ ని ఫారిన్ లో ఎంజాయ్ చేస్తున్న మహేశ్ బాబు, రోజు రోజుకీ కుర్రాడిలా మారిపోతున్నాడు.
దీనికి ప్రూఫ్ గా మహేశ్ దిగిన ఒక సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమాకి ‘అమరావతికి అటు ఇటు’, ‘ఊరికి మొనగాడు’, ‘అయోధ్యలో అర్జునుడు’ అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా ‘SSMB 28’ సినిమాకి ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ని ఆల్మోస్ట్ ఫైనల్ చేసినట్లు సమాచారం. మే 31న కృష్ణ జయంతి రోజున బయటకి రాబోయే గ్లిమ్ప్స్ తో పాటు ‘గుంటూరు కారం’ టైటిల్ ని కూడా అనౌన్స్ చెయ్యబోతున్నట్లు సమాచారం. మరి ఇది కూడా రూమర్ గా మిగిలిపోతుందా లేక ఈ టైటిల్ నే మే 31న అనౌన్స్ చేస్తారా అనేది చూడాలి.