సోషల్ మీడియాలో త్రిష పేరు టాప్ ట్రెండ్ అవుతోంది. త్రిష ట్యాగ్ ని క్రియేట్ చేసిన ఫ్యాన్స్ ఆమె ఫోటోస్ అండ్ వీడియోస్ ని పోస్ట్ చేస్తున్నారు. త్రిష ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్ గా మారి 21 ఏళ్లు అయిన సందర్భంగా త్రిష పేరుని ట్రెండ్ చేస్తున్నారు ఆమె అభిమానులు. త్రిష సోలో హీరోయిన్ గా నటించిన “మౌనం పేసియదే” తెలుగులో ఇదే మూవీ “ఆడంతే ఆడో టైపు”గా 2002 డిసెంబర్ 13న రిలీజ్ అయ్యింది. సూర్య హీరోగా నటించిన ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటికి 21 ఏళ్లు. సోలో హీరోయిన్ గా నటించడం కన్నా మూడేళ్ల ముందే త్రిష 1999లో జోడి సినిమాలో నటించింది. 2002 నుంచి హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే ఉన్న ఈ మద్రాస్ బ్యూటీకి… రెండు దశాబ్దాలైనా కెరీర్ స్లో అవ్వలేదు. తమిళ్ నుంచి తెలుగులో అడుగుపెట్టి వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, ఆడువారి మాటలకూ అర్దాలే వేరులే లాంటి సినిమాలతో ఇక్కడ కూడా మంచి హిట్స్ ని సొంతం చేసుకుంది. సౌత్ లో ఉన్న ఆల్మోస్ట్ అందరు స్టార్ హీరోలతో నటించిన త్రిష… పొన్నియిన్ సెల్వన్ సినిమాతో కెరీర్ పీక్ స్టేజ్ చూసేసింది.
ఐశ్వర్య రాయ్ ని కూడా డామినేట్ చేసే అందంతో కనిపించిన త్రిష పొన్నియిన్ సెల్వన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఈ మూవీలో త్రిషని చూసిన వాళ్లు ఆమె డీఏజింగ్ టెక్నాలజీని ఇన్ బిల్ట్ గా బాడీలోనే పెట్టుకున్నట్లు ఉంది అన్నారు. మధ్యలో యంగ్ హీరోయిన్స్ రావడంతో త్రిష కెరీర్ అయిపొయింది అనే మాటలు వినిపించాయి కానీ పొన్నియిన్ సెల్వన్, లియో సినిమాలు చేసి తన కెరీర్ కంప్లీట్ అవ్వలేదని నిరూపించింది. ప్రస్తుతం త్రిష… అజిత్ తో విడ ముయార్చి సినిమా చేస్తోంది. తెలుగులో చిరంజీవితో సినిమా అనే న్యూస్ వినిపిస్తోంది కానీ ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. సో త్రిష లైనప్ లో స్టార్ హీరోల ప్రాజెక్ట్స్ బాగానే ఉన్నాయి. త్రిష ఇండస్ట్రీలోకి వచ్చి 21 ఏళ్లు అవ్వడం గొప్ప కాదు కానీ 21 ఏళ్లు అయినా ఇప్పటికీ యంగ్ హీరోయిన్ల పోటీని తట్టుకోని కూడా స్టార్ హీరోల సినిమాలో సోలో హీరోయిన్ గా నటిస్తుండడం త్రిష గొప్పదనం.