కెజీయఫ్ సినిమాలతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కన్నడ స్టార్ హీరో యష్. తన నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలోను ఉంది. కెజీయఫ్ 2 తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ‘టాక్సిక్’ అనే సినిమా అనౌన్స్ చేశాడు యష్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే ట్యాగ్ లైన్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇక.. ఈ సినిమాలో కూడా యష్ పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్టుగా ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో చెప్పేసిన మేకర్స్.
ఇప్పుడు గ్లింప్స్‌తో అంచనాలు మరింతగా పెంచేశారు. జనవరి 8న యష్ బర్త్ డే గిఫ్ట్‌గా టాక్సిక్ నుంచి బర్త్ డే పీక్ అంటూ ఒక నిమిషం నిడివితో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ గ్లింప్స్ చూస్తే మరోసారి రాఖీభాయ్ అరాచకం అన్నట్టుగా ఉంది. ముఖ్యంగా యష్ లుక్, రెట్రో కారులో రచ్చ లేపుతు క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యష్ మరోసారి బాక్సాఫీస్‌ను బద్దలు చేయడానికి వస్తున్నట్టుగా గన్స్, గర్స్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చేలా ఈ గ్లింప్స్ కట్ చేశారు. క్లబ్‌లో గర్ల్స్‌తో యష్ చేసిన రచ్చ మాత్రం అంతా ఇంతా కాదు అన్నట్టుగా ఉంది. కెజీయఫ్ తర్వాత యష్ నుంచి ఎలాంటి సినిమా కోసమైతే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారో అలాంటి మాసివ్ ట్రీట్ ఇచ్చేలా టాక్సిక్ గ్లింప్స్ అంచనాలను పెంచేసింది. ఓవరాల్‌గా టాక్సిక్ మూవీ రెట్రో స్టోరీలా అనిపిస్తోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. యష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ టాక్సీక్ తో సూపర్ హిట్ కొట్లాలని ఆశిద్దాం.