Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

రాష్ట్ర హోదా కల్పించాలని లడఖ్‌లో నిరసనలు.. బీజేపీ ఆఫీస్ దగ్ధం

రాష్ట్ర హోదాను డిమాండ్ చేస్తూ లడఖ్‌లో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బుధవారం బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. దీంతో నిరసనకారులకు పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీస్ వాహనాలను ఆందోళనకారులు తగలబెట్టారు. అలాగే బీజేపీ కార్యాలయానికి కూడా నిప్పుపెట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బుధవారం ఉదయం లడఖ్‌లోని లేహ్ నగరంలో లడఖ్‌కు రాష్ట్ర హోదా, రాజ్యాంగ రక్షణలు కల్పించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. భారీగా నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీంతో అధికారులపై రాళ్లు రువ్వారు. పోలీసు వాహనాన్ని కూడా తగలబెట్టారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో జరిగిన మొదటి హింస ఇదే. జనసమూహాన్ని చెదరగొట్టడానికి పోలీసులు టియర్-గ్యాస్ షెల్లింగ్ ప్రయోగించారు. లాఠీచార్జ్‌ కూడా చేశారు.

ఈ సారి డిపాజిట్లు కష్టమే.. పవన్ కల్యాణ్‌పై ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు..

పవన్ కల్యాణ్‌కి రైతు సమస్యలు మహిళల సమస్యలు, విద్యార్థుల సమస్యలు పట్టవని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు.. హరిహర వీరమల్లు, OG సినిమా షూటింగ్ ల కోసం, బెనిఫిట్ షోలు రేట్లు ఎంత పెంచుకుందామని ఆలోచన తప్ప… ప్రజా సమస్యల పట్టవని విమర్శించారు.. ఆయన నియోజకవర్గంలో దళితుల మీద దాడులు జరిగితే స్పందించరన్నారు… పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ లు చేసుకుంటే… రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినట్టు? అని ప్రశ్నించారు. ఈసారి పవన్ కల్యాణ్ కి డిపాజిట్లు కూడా రావంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఎప్పుడు చూసినా హైదరాబాద్‌లో ఉండటం తప్ప.. పవన్ కల్యాణ్ చేసింది ఏంటి? అని ప్రశ్నించారు.

నాలుగు సార్లు సీఎంగా ఉండి ఒక్క మెడికల్ కాలేజ్ అయినా తెచ్చారా..?

దేశ చరిత్రలో ఆరోగ్య శ్రీ ప్రవేశ పెట్టిన ఘనత రాజశేఖర్ రెడ్డిదని వైసీపీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు అన్నారు.. తాజాగా శాసనమండలిలో ఆయన మాట్లాడారు. తండ్రికి తగ్గ తనయుడిగా జగన్ విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు.. ప్రతి పార్లమెంట్‌లో మల్టీ హాస్పిటల్స్ పెట్టాలని, పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు పెంచడం కోసం ప్రతి నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్‌లు మొదలు పెట్టారన్నారు.. రాష్ట్రంలో అరకొర సీట్లు సరిపోక ఇతర దేశాలకు విద్యార్థులు పోతున్నారని తెలిపారు.. చంద్రబాబు 4సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకొని రాలేదని విమర్శించారు.. రాష్ట్రంలో 2014 ముందు 44వేల వైద్యులు ఉంటే 2019లో ఆ సంఖ్యను 88 వేలకు పెంచారని చెప్పారు..

లేట్ కంటెంట్.. డెలివరీ బాయ్స్ గా మారిన ఫ్యాన్స్

మరికొద్ది గంటల్లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓ.జి. సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని టి.వి. ఎంటర్టైన్మెంట్ మీద దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మరికొద్ది గంటల్లో ఈ సినిమా ప్రీమియర్స్ ఉండగా, చివరి నిమిషం వరకు కంటెంట్ డెలివరీ చేయలేకపోయాడు సుజిత్. డి.ఐ. సహా పలు కారణాలు చెబుతూ ఈ కంటెంట్ లేట్ చేశారు. అయితే, అమెరికాలో పలు చోట్ల ఈ సినిమా ప్రీమియర్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. కానీ, ప్రత్యంగిరా యు.ఎస్. అనే సంస్థ ఈ సినిమా నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ తీసుకుంది.

పాకిస్తాన్ స్కూల్ బుక్స్‌లో ‘‘ఆపరేషన్ సిందూర్’’.. అన్ని అబద్ధాలే..

పాకిస్తాన్ తన చరిత్రను తప్పుగా చెప్పుకోవడం అలవాటు. ముఖ్యంగా, భారత్ విషయంలో ఏం జరిగినా, ఎన్ని యుద్ధాల్లో ఓడిపోయినా, చివరకు తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్)ని కోల్పోయినా కూడా తమదే పై చేయి అని అక్కడి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉంది. చివరకు విద్యార్థులకు నిజాలు తెలియకుండా, తప్పుడు అంశాలను స్కూల్ పాఠ్యాంశాలుగా చేర్చుతోంది. తాజాగా, మే నెలలో జరిగిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి కూడా అక్కడి టెక్ట్స్ బుక్స్‌లో తప్పుడు పాఠ్యాంశాన్ని చేర్చింది. ఈ స్కూల్ బుక్స్‌లో భారత్-పాక్ మధ్య జరిగిన నాలుగు రోజుల ఘర్షణలో తామే పైచేయి సాధించినట్లు పాకిస్తాన్ చెప్పుకుంది. భారతదేశం ఘర్షణను ప్రేరేపించిందని, పాకిస్తాన్ సైన్యం ప్రతీకారంగా భారత వైమానిక స్థావరాలను నాశనం చేసిందని, పాకిస్తాన్ యుద్ధంగో గెలిచిందని తప్పుడు ప్రచారాన్ని చేసుకుంది.

కూతురు పెళ్లిలోనూ పసుపు చొక్కానే ధరించిన మంత్రి.. నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్య..

సందర్భం ఏదైనా తెలుగు దేశం పార్టీపై .. పసుపు రంగుపై ఆయనకి ఉన్న అభిమానాన్ని, ఆప్యాయతని వదిలిపెట్టని నాయకుడిగా మారిపోయారు మంత్రి నిమ్మల రామానాయుడు. పార్టీ కార్యక్రమమైన, అసెంబ్లీ సమావేశాలైన నిత్యం పసుపు చొక్కాతో కనిపించే మంత్రి నిమ్మల రామానాయుడు తన కూతురి వివాహ వేడుకలోనూ పసుపు చొక్కాని వదిలిపెట్టలేదు. పాలకొల్లులో ఈరోజు జరిగిన నిమ్మల రామానాయుడు కుమార్తె శ్రీజ వివాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో పాటు ఎంపీలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాయకులు హాజరయ్యారు. ఆ సమయంలోనూ మంత్రి నిమ్మల పసుపు చొక్కాతోనే కనిపించడం విశేషంగా మారింది.

పైడితల్లి అమ్మవారి పండుగలో అందరూ భాగస్వాములవ్వాలి!

శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి పండగ‌, విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాల్లో ప్ర‌తీఒక్క‌రూ భాగ‌స్వాములు కావాల‌ని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్‌, ఎన్నారై సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ పిలుపునిచ్చారు. గంట్యాడ మండ‌లం కొండ‌ తామ‌రాప‌ల్లి గ్రామంలో వెలసిన‌, పైడిత‌ల్లి అమ్మ‌వారికి ప్ర‌తిరూపంగా భావించే సిరిమాను వృక్షాన్ని మంత్రి శ్రీ‌నివాస్ బుధ‌వారం స‌తీస‌మేతంగా ద‌ర్శించుకొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. భ‌క్తుల జ‌య‌జ‌య‌ద్వానాల, మ‌ధ్య చెట్టుకు గొడ్డ‌లితో గాట్లు పెట్టి సిరిమాను త‌యారీ ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఉత్త‌రాంధ్ర క‌ల్ప‌వ‌ల్లి పైడిత‌ల్లి అమ్మ‌వారు విజ‌యానికి ప్ర‌తిరూప‌మ‌ని పేర్కొన్నారు. అమ్మ‌వారి సిరిమాను పండుగ‌ను, దానితోపాటుగా విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని చెప్పారు. ఈ ఉత్స‌వాల్లో ప్ర‌తీఒక్క‌రూ భాగ‌స్వాములు కావాల‌ని మంత్రి కోరారు. అమ్మ‌వారు సిరిమాను రూపంలో త‌మ నియోజ‌క‌వ‌ర్గంలోని గంట్యాడ మండ‌లంలో ప్ర‌త్య‌క్షం కావ‌డం త‌మ‌ అదృష్ట‌మ‌ని పేర్కొన్నారు. అమ్మ‌వారు రాష్ట్రాన్ని చ‌ల్ల‌గా చూడాల‌ని, ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటై యువ‌త‌కు ఉద్యోగాలు రావాల‌ని మంత్రి ఆకాంక్షించారు.

‘డిజిటల్‌ బుక్’ పోర్టల్‌ లాంచ్‌ చేసిన జగన్.. అన్యాయం జరిగితే అప్‌లోడ్‌ చేయండి..

‘డిజిటల్‌ బుక్’ పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించారు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఎలాంటి అన్యాయం జరిగిన అప్‌లోడ్‌ చేయండి అని పిలుపునిచ్చారు.. Digitalbook.weysrcp.com పేరుతో పోర్టల్ లాంచ్ చేశారు జగన్.. అన్యాయం మరియు రాజకీయ బాధితులను ఎదుర్కొన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరియు నాయకులకు అండగా నిలిచేందుకు.. ప్రత్యేక పోర్టల్ తెస్తామంటూ గత కొంతకాలంగా చెబుతూ వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈరోజు పార్టీ అధికారిక వేదికపై ఒక అద్భుతమైన డిజిటల్ బుక్‌ను ప్రారంభించారు. ఇది https://digitalbook.weysrcp.com/auth/phoneలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. దీని ద్వారా ఎవరైనా తాము ఎదుర్కొన్న అన్యాయానికి సంబంధించిన వివరాలను నేరుగా అప్‌లోడ్ చేయవచ్చు, ప్రతి సంఘటనను శాశ్వత డిజిటల్ డైరీలో నమోదు చేసి భద్రపరుస్తారు. వెబ్‌సైట్‌తో పాటు, 040-49171718 ద్వారా IVRS కాల్ సౌకర్యం ఏర్పాటు చేసింది వైసీపీ.. దీని ద్వారా కార్మికులు మరియు బాధితులు ఫోన్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు.

భారత్-పాక్ యుద్ధాన్ని ఆపారు.. ట్రంప్ ప్రపంచ శాంతి కాముకుడు అంటూ పాక్ ప్రధాని ప్రశంసలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రశంసలు కురిపించారు. మే నెలలో భారత్-పాకిస్థాన్ మధ్య వినాశకరమైన యుద్ధాన్ని ట్రంప్ నిలిపివేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీప్ హాజరయ్యారు. ఇక యూఎన్ సమావేశాల్లో దాదాపు గంట సేపు ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏడు నెలల్లో 7 యుద్ధాలు ఆపానంటూ మళ్లీ గుర్తుచేశారు.

గ్రూప్-1 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట.. సింగిల్‌ బెంచ్‌ తీర్పు సస్పెండ్‌

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ర్యాంకుల విషయంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. దీంతో గ్రూప్-1 ర్యాంకర్లకు, టీజీపీఎస్సీ (TGPSC)కి భారీ ఊరట లభించింది. ఈ నిర్ణయంతో గ్రూప్-1 నియామకాలకు లైన్ క్లియర్‌ అయ్యింది. గ్రూప్-1 ర్యాంకింగ్‌లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై గతంలో విచారణ జరిపిన సింగిల్ బెంచ్, ఈ నెల 9వ తేదీన ర్యాంకులను రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. తిరిగి పేపర్లను దిద్దాలని, అది సాధ్యం కాకపోతే రీ-ఎగ్జామ్ నిర్వహించాలని 8 నెలల గడువు విధించింది. ఈ తీర్పుతో ర్యాంకర్లు, టీజీపీఎస్సీ ఆందోళన వ్యక్తం చేశాయి.

 

Exit mobile version