Tollywood : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ నివాసంలో టాలీవుడ్ నిర్మాతలు, డైరెక్టర్లు మర్యాద పూర్వకంగా కలిశారు. సినీ కార్మికుల సమ్మె ముగింపు కోసం చొరవ చూపించినందుకు సీఎంను వీరు కలిశారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, నిర్మాతలు అల్లు అరవింద్, డి.సురేష్ బాబు, జెమిని కిరణ్, స్రవంతి రవికిశోర్, నవీన్ ఎర్నేని, వంశీ, బాపినీడు, డివివి దానయ్య, వంశీ, గోపి, చెరుకూరి సుధాకర్, సాహు, అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్, అనిల్ సుంకర, శరత్ మరార్, ఎన్వీ ప్రసాద్, ఎస్కేన్, రాధామోహన్, దాము ఉన్నారు.
Read Also : Madarasi Trailer : మదరాసి ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే..?
అటు డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల ఉన్నారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సినీ ఇండస్ట్రీకి తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగానే ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. పదేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డులను గద్దర్ అవార్డుల పేరుతో తిరిగి ప్రారంభించినట్టు తెలిపారు. ప్రభుత్వం కఠినంగా పైకి కనిపించినా ఇండస్ట్రీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుందన్నారు సీఎం రేవంత్.
Read Also : OG : ఓజీ నుంచి భారీ అప్డేట్.. మూడు రోజుల్లోనే..
