సంక్రాంతికి ఇటు తెలుగు, అటు తమిళ ఇండస్ట్రీల్లో బిగ్ కాంపీటీషన్ నెలకొంది. మూడు పాన్ ఇండియన్ చిత్రాలతో పాటు మరికొన్ని ఆయా భాషల్లో పోటీ పడుతున్నాయి. కన్నడ ఇండస్ట్రీలో కూడా మన చిత్రాలదే హవా. కిచ్చా సుదీప్, ఉపేంద్ర లాంటి స్టార్ల హడావుడి క్రిస్మస్ కు కంప్లీట్ కావడంతో, ఇప్పుడు అరకొర సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఫ్యాన్స్ కూడా గేమ్ ఛేంజర్, ఢాకూ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాల కోసమే వెయిట్ చేస్తున్నారు.
Also Read : Sunny Deol : ‘జాట్’ ను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేస్తున్న గోపీచంద్ మలినేని
శాండిల్ వుడ్ లో ఫెస్టివల్ ట్రీట్ కు సిద్ధమయ్యాయి కొన్ని చిత్రాలు. వాటిల్లో కాస్తంత క్యూరియస్ కలిగిస్తోంది శరణ్ నటించిన ఛూమంతర్. రీసెంట్లీ రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. గేమ్ ఛేంజర్ తో పోటీగా జనవరి 10న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది. ఛూమంతర్ గత ఏడాదే రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని రీజన్స్ వల్ల వాయిదా పడుతూ ఇప్పుడు ప్రేక్షకులను పలకరించబోతుంది. దీనితో పాటు హిట్టు మూవీ సంజు వెడ్స్ గీత సీక్వెల్ కూడా ఇదే రోజున రిలీజౌతోంది. రచితా రామ్, శ్రీనరగ కిట్టీ హీరో హీరోయిన్లు. ఇక శివ రాజ్ కుమార్ బ్రదర్ రాఘవేంద్ర రాజ్ కుమార్ కీ రూల్ చేస్తున్న’కన్న మచ్చే కాడే గూడే’ జనవరి 17న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అయితే ఇవన్నీ కూడా జస్ట్ ప్రాంతీయ చిత్రాలుగా మాత్రమే పరిమితమౌతున్నాయి. చందన సీమలో కూడా టాలీవుడ్ సినిమాల మధ్యే పోటీ నెలకొంది. గేమ్ ఛేంజర్, ఢాకూ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలే సంక్రాంతిని క్యాష్ చేసుకోబోతున్నాయి.