Site icon NTV Telugu

Heros : అన్నలు సక్సెస్.. తమ్ముళ్లకు ఏమైంది..?

Heros

Heros

Heros : సినీ ఇండస్ట్రీలో అన్నలు సక్సెస్ అయితే తమ్ముళ్లు కూడా ఎంట్రీ ఇస్తుంటారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారంతా అన్నల రేంజ్ లో సక్సెస్ అవుతారనే గ్యారెంటీ లేదు. చిరంజీవి తర్వాత పవన్ కల్యాణ్‌ స్టార్ హీరో అయ్యాడు. కానీ అలా అందరూ కాలేకపోయారు. ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ ఎదిగితే.. శిరీష్ కనీసం యావరేజ్ హీరోల లిస్టులో కూడా లేడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండిపోయాడు. అలాగే సాయిధరమ్ తేజ్ అంతో ఇంతో మంచి సినిమాలే చేస్తున్నాడు. కానీ వైష్ణవ్ తేజ్ అన్నలా సినిమాలు చేయలేకపోతున్నాడు. సాయితేజ్ కు అంతో ఇంతో ఫ్యాన్ బేస్ ఉంది. కానీ వైష్ణవ్ కు సొంతంగా ఇమేజ్ రావట్లేదు.

Read Also : Baahubali Epic : రీ రిలీజ్ లోనూ టాప్ హీరోలకు బాహుబలి చెక్.. ఏంట్రా ఈ క్రేజ్..

విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఆయన తమ్ముడు ఆనంద్ అంతో ఇంతో మంచి సినిమాలే చేస్తున్నాడు. కానీ విజయ్ స్థాయిలో పెద్ద సినిమాలు చేయట్లేదు. అన్న రేంజ్ లో ఫ్యాన్ బేస్ కూడా రావట్లేదు. అటు నాగచైతన్య మంచి సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్నాడు. స్టార్ హీరో అయ్యే దారిలో ఉన్నాడు. కానీ అఖిల్ కు మాత్రం హిట్ పడి కొన్నేళ్లు అవుతోంది. ఆయన కెరీర్ లో హిట్ అనేది కరువైపోయింది. అక్కినేని బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సక్సెస్ కాలేకపోతున్నాడు అఖిల్.

Read Also : JR NTR : జూనియర్ ఎన్టీఆర్ పై శింబు షాకింగ్ కామెంట్స్

Exit mobile version