BB Ki Vines: ‘ట్రిపుల్ ఆర్’ స్టార్స్ కు చుక్కలు చూపించిన టిటూ టాక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూ- ట్యూబర్ భువన్ కు ఉన్న క్రేజ్ ఇంతా అంతా కాదు. బీబీ కీ వైన్స్ పేరుతో అతను నిర్వహిస్తున్న ఛానెల్ ను 25 మిలియన్ కు పైగా సబ్ స్కైబర్స్ ఫాలో అవుతున్నారు. అతను చేసే ఫన్నీ ఇంటర్వ్యూలలో చిన్నపాటి సెటైర్ కూడా చోటు చేసుకుంటూ ఉంటుంది. ఇటీవల భువన్ ‘ట్రిపుల్ ఆర్’ హీరోలు ఎన్టీయార్, రామ్ చరణ్, డైరెక్టర్ రాజమౌళితో చిన్న పాటి చిట్ చాట్ నిర్వహించాడు. విశేషం ఏమంటే… గ్రాండ్ గా లీడ్ తీసుకుని… ఇదంతా రజనీకాంత్ కు సంబంధించింది అంటూ తేల్చేశాడు. ఇక రాజమౌళి, ఎన్టీయార్, చెర్రీని తనదైన శైలిలో ఆడుకున్నాడు. ఎన్టీయార్ నటించిన ‘శక్తి’ సినిమా తనకి బాగా ఇష్టమైందంటూ అందులోని డైలాగ్స్ చెప్పాడు. ‘శక్తి’ తప్పితే మరే సినిమా నువ్వు చూడలేదా? దాన్ని మర్చిపో అని చివరకు ఎన్టీయార్ ప్రాధేయపడేలా చేశాడు. ఆ సమయంలో ముసిముసిగా నవ్వుకున్న రామ్ చరణ్ నూ భువన్ వదిలిపెట్టలేదు. రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ‘జంజీర్’ మూవీ మీదా సెటైర్ వేశాడు. థియేటర్ లో ఆడియెన్స్ లేకపోవడంతో బిందాస్ గా ఎంజాయ్ చేస్తూ చూశానని చెప్పాడు.
రాజమౌళిని ‘మాన్ స్టర్’ అని ఎందుకు ఎన్టీయార్ సంబోధిస్తారో చెప్పమని ఒత్తిడి చేశాడు. డెవిల్ అయిన ఎన్టీయార్ కు ఎదుటి వ్యక్తి మాన్ స్టర్ గా కనిపించడంలో తప్పులేదని రాజమౌళి కవర్ చేశాడు. రాజమౌళిని ‘రాజా’ అని సంబోధిస్తూ, ‘కింగ్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ’ అని కితాబిచ్చాడు. ఇక ఆయన తీసిన ‘బాహుబలి’ సినిమాతో తాను భార్యతో పడుతున్న కష్టాన్ని చెప్పుకుని ఘొల్లు మన్నాడు. ప్రభాస్ భుజాన శివలింగాన్ని పెట్టుకుని మోసినట్టు మూడో అంతస్తుకు గ్యాస్ సిలిండర్ మోయమని భార్య పోరుపెడుతోందని వాపోయాడు. ‘ట్రిపుల్ ఆర్’ మూవీ తీస్తున్న సమయంలో తాను హీరోల ఇమేజ్ ను పట్టించుకోలేదని, కేవలం వారి క్యారెక్టర్లకు న్యాయం చేయడానికే కృషి చేశానని రాజమౌళి తెలిపాడు.
Also Read
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
- The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
- Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
- Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. 'వారణాసి'పై క్రేజీ అప్డేట్ వైరల్!
లెగసీ అనేది ఎప్పటికీ బరువు కాదని, దాని ద్వారా డిసిప్లీన్ వస్తుందని రామ్ చరణ్ చెప్పగా, సినిమాలు పరాజయం పాలైనప్పుడు ఆ లెగసీలోని గొప్పతనాన్ని తాను అర్థం చేసుకున్నానని ఎన్టీయార్ తెలిపాడు. చివరగా అలియా భట్ తో ఒక్కసారి ఫోన్ లో మాట్లాడించమని ఈ టీమ్ ను కోరగానే… ‘మేం మేనేజర్ల మాదిరిగా కనిపిస్తున్నామా’ అంటూ వారంత ఇంటర్వ్యూ నుండి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. దాదాపు 14 నిమిషాల పాటు సాగిన ఈ ఫన్నీ ఇంటర్వూ సరదాగా సాగింది. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ ను జనవరి 7 గా పేర్కొనకుండా… దానిని మార్చి ఉంటే బాగుండేది! దాంతో ఇది ఎప్పుడో రికార్డ్ చేసి ఇప్పుడు స్ట్రీమింగ్ చేసినట్టు తెలిసిపోతోంది.
.@Bhuvan_Bam Titu Talks with Team #RRRMovie is now live 🌟🙌🏻
Watch and enjoy this fun filled episode. https://t.co/IsjGpQMgmC@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan #RRRMovie @RRRMovie
— DVV Entertainment (@DVVMovies) March 15, 2022
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!