RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఇక ఈ సినిమా తరువాత చరణ్.. బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఉప్పెన సినిమాతో స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో చేరాడు బుచ్చిబాబు. ఉప్పెన తరువాత.. ఎన్టీఆర్ తో సినిమా చేయాలనీ చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ, ఎన్టీఆర్ డేట్స్ అడ్జస్ట్ అవ్వకనో.. ఎన్టీఆర్ కు కథ నచ్చకనో.. ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఈ గ్యాప్ లోనే తన కథతో చరణ్ ను మెప్పించాడు. వెంటనే సినిమాను చరణ్ అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది. దీంతో బుచ్చిబాబు.. ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. హీరోయిన్ దగ్గరనుంచి విలన్ వరకు స్టార్స్ ను మాత్రమే తీసుకోవాలని అనుకుంటున్నాడట.
Skanda: రిలీజ్ కు పట్టుమని పదిరోజులు కూడా లేదు.. ప్రమోషన్స్ ఎక్కడయ్యా.. రామయ్య..?
ఇక టాలీవుడ్ లో ఒక కొత్త ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. టాలీవుడ్ హీరోలకు .. బాలీవుడ్ స్టార్ హీరోలు విలన్స్ గా మారుతున్నారు. ఇక ఈ ట్రెండ్ నే బుచ్చిబాబు కొనసాగిస్తున్నాడని టాక్ నడుస్తోంది. బాలీవుడ్ స్టైలిష్ అండ్ కండల వీరుడు టైగర్ ష్రాఫ్ ను చరణ్ కోసం రంగంలోకి దించాలని చూస్తున్నారట. అయితే.. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇదే కనుక నిజమైతే.. చరణ్ స్క్రీన్ ప్రజెన్స్ కన్నా టైగర్ ఎక్కువ కనిపిస్తాడు.. అందుకే వద్దు అని చరణ్ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇంకోపక్క.. అరేయ్.. నమ్మేలా ఉండే రూమర్ చెప్పండ్రా ..? బాబు అంటూ జోక్స్ చేస్తున్నారు. మరి ఇది నిజమో కాదో.. మేకర్స్ అధికారికంగా చెప్పేవరకు ఆగాల్సిందే.