సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ ‘ఎస్ఎస్ఎంబి28’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి సినిమా కథ దగ్గర నుంచి హీరో పాత్ర, సినిమా టైటిల్, హీరోయిన్ ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ బాబు రా ఏజెంట్ గా నటించబోతున్నాడని, సినిమాకు మేకర్స్ ‘పార్థు’ అనే టైటిల్ అనుకుంటున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై నెట్టింట్లో హాట్ చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి హీరోయిన్ల రేసులో ముగ్గురు ముద్దుగుమ్మలు ఉన్నారు. జాహ్నవి కపూర్, దిశా పటాని, పూజా హెగ్డే… స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న ఈ ముగ్గురు అందగత్తెలలో ఒకరు మహేష్ తో రొమాన్స్ చేసే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. అయితే ఈ చిత్రం కోసం జాన్వీ కపూర్ భారీగా డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే దిశా రెండవ ఛాయిస్ అవుతుంది. ఒకవేళ ఇద్దరూ కాకపోతే త్రివిక్రమ్ పూజా హెగ్డేని ఎంపిక చేసే అవకాశం ఉందనేది తాజా సమాచారం. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత, అల వైకుంఠపురం’ చిత్రాల్లో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.