ఈ వారం రెండు సినిమాలు థియేటర్లోకి వచ్చాయి. ఒకటి ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘స్కంద’… ఇంకోటి క్లాస్ డైరెక్టర్ తీసిన మాస్ మూవీ ‘పెదకాపు 1’. ఈ రెండు సినిమాలు కూడా మాస్ ఆడియెన్స్ టార్గెట్‌గా వచ్చాయి. థియేటర్లో బోయపాటి, రామ్ చేసిన ఊచకోత మామూలుగా లేదు. తమన్ బాదుడుకు చెవులకు చిల్లులు పడుతున్నాయి. మొత్తంగా బోయపాటి మాస్ డైరెక్టర్ కాబట్టి… లాజిక్స్ లేకుండా సినిమా చూస్తే బెటర్ అనే టాక్ సొంతం చేసుకుంది స్కంద కానీ ఈ సినిమాకు సీక్వెల్ కూడా అనౌన్స్ చేశాడు బోయపాటి. క్లైమాక్స్‌లో రామ్ డ్యూయెల్ రోల్ అని సర్ప్రైజ్ చేసి… సెకండ్ పార్ట్ ఉంటుందని ఫిక్స్ చేశాడు. దీంతో… పార్ట్ వన్‌కే మాస్ డోస్ ఎక్కువైంది, ఇలాంటి సినిమాకు సీక్వెల్ అవసరమా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి పైగా బోయపాటి అఖండ 2, సూర్యతో సినిమా, అల్లు అర్జున్ తో ఒక సినిమా కమిట్ అయ్యాడు అనే మాటలు వినిపిస్తున్నాయి.
ఇమ్మిడియట్ గా అయితే అఖండ 2 ఉంటుంది, ఈ సినిమా అయిపోయిన తర్వాతే… స్కంద 2 ఉంటుంది కాబట్టి స్కంద2 ఇప్పట్లో కష్టమనే అంటున్నారు. ఇక శ్రీకాంత్ అడ్డాల విరాట్ కర్ణను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ… పెదకాపుని ముందే రెండు భాగాలని ప్రకటించాడు. ఇప్పుడు రిలీజ్ అయింది పార్ట్ వన్. ఈ సినిమా కూడా ఊరమాస్‌గా ఉందని అంటున్నారు. ఇది ఒక రా అండ్ రస్టిక్ పొలిటికల్ డ్రామా… మితిమీరిన హింసను భరిస్తే తప్ప… ఈ సినిమాను చూడలేమనే టాక్ సొంతం చేసుకుంది. స్కంద కలెక్షన్స్ పరంగా బాగానే రాబడుతోంది కానీ పెదకాపు అంతంతమాత్రంగానే ఉంది. ఇలాంటి సమయంలో ఈ సినిమాలకు సీక్వెల్స్ అవసరమా? అనే చర్చ జరుగుతోంది. అయితే పెదకాపు2 రావడం మాత్రం గ్యారెంటీ. స్కంద2 ఉంటుందో? లేదో చూడాలి. మరి ఈ న్యూస్ డైరెక్టర్స్ బోయపాటి, శ్రీకాంత్ అడ్డాలా వింటున్నారా? సీక్వెల్స్ తీసుకోస్తారా? అనేది వేచి చూడాల్సిందే.