ఈ వారం రెండు సినిమాలు థియేటర్లోకి వచ్చాయి. ఒకటి ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘స్కంద’… ఇంకోటి క్లాస్ డైరెక్టర్ తీసిన మాస్ మూవీ ‘పెదకాపు 1’. ఈ రెండు సినిమాలు కూడా మాస్ ఆడియెన్స్ టార్గెట్‌గా వచ్చాయి. థియేటర్లో బోయపాటి, రామ్ చేసిన ఊచకోత మామూలుగా లేదు. తమన్ బాదుడుకు చెవులకు చిల్లులు పడుతున్నాయి. మొత్తంగా బోయపాటి మాస్ డైరెక్టర్ కాబట్టి… లాజిక్స్ లేకుండా సినిమా చూస్తే బెటర్ అనే టాక్ సొంతం చేసుకుంది…