బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో జోరు మీదున్నాడు మాస్ మహారాజ. ఓవైపు భాను భోగవరపు దర్శకత్వంలో ‘మాస్ జాతర’ సినిమా చేస్తున్నాడు రవితేజ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు తన నెక్ట్స్ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్తున్నాడు. నేనుశైలజా, చిత్రలహరి వంటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఇటీవల ఈ సినిమాను పూజా కార్యక్రమాకు కూడా నిర్వహించారు.
Also Read : sharvari wagh : శారీలో శార్వరి.. కుర్రాళ్ల మదిలో కొలవెరి..
కాగా ఈ సినిమా షూట్ ను స్టార్ట్ చేసారు మేకర్స్. హైదరాబాద్ లో వేసిన కొన్ని ప్రత్యేకమైన సెట్ లో సీన్స్ తీస్తున్నారు. అలాగే ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేశారట. కిశోర్ తిరుమల గత సినిమాల మాదిరి ఈ సినిమాకు కూడా ‘అనార్కలి’ అనే సాఫ్ట్ టైటిల్ ను అనుకుంటున్నారట. దాదాపుగా ఇదే ఫైనల్ అని తెలుస్తోంది. రవితేజ స్టైల్ కామెడీ, కిషోర్ టేకింగ్ లో ఉండే ఎమోషన్స్ తో ఉండే ఈ కథను ‘అనార్కలి’ టైటిల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని టీమ్ భావిస్తోంది. కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆషిక రంగనాధ్ ను రవితేజ సరసన హీరోయిన్ గా రొమాన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు మేకర్స్. అత్యంత భారీ బడ్జెట్ తో SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.