టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు దేవి శ్రీ ప్రసాద్. ఆయన సంగీత దర్శకుడిగా మాత్రమే కాకుండా సింగర్ కూడా చాలా పాటలు పాడారు. రీసెంట్ గా ‘పుష్ప 2’ సినిమా ద్వారా సక్సెస్ కొట్టిన దేవిశ్రీప్రసాద్ త్వరలోనే ‘తండేల్’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి కాంబోలో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బుజ్జితల్లి పాట అయితే ఆడియన్స్‌కి విపరీతంగా నచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ చాలా రోజుల తర్వాత ఓ మంచి మెలోడీ ఇచ్చారంటూ ఫ్యాన్స్ అంటున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం దేవి శ్రీ ప్రసాద్ నా సినిమాకు వర్క్ చేయొద్దు.. అని అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి..
Also Read:Singer Chinmai: సింగర్ ఉదిత్ నారాయణ్ ముద్దు వివాదంపై.. వైరల్ కామెంట్స్ చేసిన చిన్మయి
ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు అరవింద్ తాను అసలు దేవి ని వద్దనడానికి గల కారణాన్ని బయటపెట్టాడు. అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘ముందుగా ‘తండేల్’ కోసం టీమ్ దేవిశ్రీ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుందాం అనుకుంటే నేను వద్దని అన్నాను. ఎందుకంటే అదే సమయంలో ‘పుష్ప2’ కి కూడా వర్క్ చేస్తున్నారు. దీంతో దేవి మా సినిమా కోసం టైమ్ స్పేర్ చేయగలరా అనే సందేహం వచ్చింది. దేవి అంటే నాకు చాలా ఇష్టం.. మాకు చాలా సినిమాలు చేశాడు. కానీ ఈ సినిమాకు తీసుకోవడం కరెక్టేనా అని సందేహంలో ఉండిపోయాను. అలా ఒక రోజు ఈ విషయం గురించి బన్నీతో డిస్కస్ చేయగా.. లవ్ స్టోరీ అంటే దేవినే.. ఇక ఏ మాత్రం ఆలోచించకు అని చెప్పాడు. దాంతో ఇక దేవికే అని ఫిక్స్ అయిపోయా’ అని తెలిపారు అల్లు అరవింద్.