టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్ , జూ. ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. జనవరి 7 న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేసేశారు చిత్ర బృందం . ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు అంటూ ఆర్ఆర్ఆర్ త్రయం ఖాళీ లేకుండా తిరుగుతున్నారు. ఇక ఈ సినిమాకు ముందు స్టార్ హీరోలు ఇలాంటి ఇంటర్వ్యూలు మిస్ అవ్వడంతో ఇన్నేళ్లు అడగాల్సిన ప్రశ్నలన్నింటినీ యాంకర్లు ఏకరువు పెట్టేస్తున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ ని ఒక యాంకర్ సమంత గురించి ప్రశ్న అడిగాడు. సమంత గురించి మూడు ముక్కలో చెప్పలంటే ఏం చెప్తారు అని అడగగా.. వెంటనే రామ్ చరణ్ “సమంత కమ్ బ్యాక్.. బిగ్గర్.. మరియు స్ట్రాంగర్” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక తాజాగా ఈ వీడియో చుసిన సామ్ ఆ వీడియోను షేర్ చేస్తూ లవ్ సింబల్ గుర్తుతో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రామ్ చరణ్ అన్న మాటలకూ సామ్ మురిసిపోయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం చరణ్ అన్న మాటలనే సామ్ ఫాలో అవుతుంది. విడాకుల తరువాత ఎలాంటి ట్రోల్స్ ని పట్టించుకోకుండా స్ట్రాంగ్ గా నిలిచి కంబ్యాక్ ఇస్తోంది. ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే చరణ్, సమంత రంగస్థలం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. చిట్టిబాబు- రామలక్ష్మీల వారి నటన ప్రేక్షకుల మనుసులను ఎంతగానో ఆకట్టుకొంది.
♥️♥️♥️ https://t.co/IqHN3aQ8Jw
— Samantha (@Samanthaprabhu2) December 27, 2021