పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” బాక్సాఫీస్ వద్ద రోరింగ్ హిట్ అయింది. కొన్ని ఏరియాల్లో కలెక్షన్స్ నెమ్మదించినా ఈ సినిమా రెండో వారంలో కూడా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. హిందీలో త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ ను శుక్రవారం విడుదల చేశారు మేకర్స్. అయితే హిందీలో పవన్ కు డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు పవన్ అభిమానులు.
Read Also : Shane Warne Demise : క్రికెట్ లెజెండ్ కు సెలెబ్రిటీల నివాళి
ప్రముఖ హిందీ నటుడు శ్రేయాస్ తల్పాడే “పుష్ప” హిందీ వెర్షన్ లో అల్లు అర్జున్ కు డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. ఇక “పుష్ప ” హిందీలో ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు పవన్ కు హిందీ వాయిస్ ఓవర్ ఇచ్చింది ప్రముఖ హిందీ టీవీ నటుడు గౌరవ్ చోప్రా. గౌరవ్ బాలీవుడ్ బుల్లితెరపై పాపులర్. మరి ఈయన డబ్బింగ్ సినిమాకు ఏ మేరకు ప్లస్ అవుతుంది ? హిందీలో డీసెంట్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తుంది అన్నది చూడాలి. పవన్ తో పాటు రానా మరో కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహించారు. నిత్యామీనన్ , సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, తమన్ సంగీతం అందించారు.