Thikamakathanda Movie Pre release Event: ఒక ఊరిలో ప్రజలందరికీ మతిమరుపు అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో డిసెంబర్ 15న విడుదలకు సిద్ధమవుతోంది తికమక తండా అనే సినిమా. ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ట్విన్స్ హరికృష్ణ, రామకృష్ణ హీరోలుగా యాని, రేఖ నిరోషా హీరోయిన్లుగా వెంకట దర్శకత్వంలో వస్తున్న తికమకతాండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా ప్రొడ్యూసర్స్ సి. కళ్యాణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్ వచ్చి మూవీ టీం కి అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో డైరెక్టర్ వెంకట్ మాట్లాడుతూ ముందుగా ఈ కథ ప్రొడ్యూసర్ తిరుపతి శ్రీనివాస రావుకి చెప్పినప్పుడు ఆయన నేను నా కొడుకులు కోసమే ఈ సినిమా తీయడానికి రెడీ అవుతున్నాను అన్నారు.
Varahi Yatra: మళ్లీ వారాహి యాత్ర..
హీరోల హరికృష్ణ రామకృష్ణ కి స్టొరీ బాగా నచ్చడంతో ఈ సినిమా మొదలైంది, యాని, రేఖ అందరూ బాగా సపోర్ట్ చేశారు. శివన్నారాయణ, రాకెట్ రాఘవ, యాదమ్మ రాజు, భాస్కర్ ప్రతి ఒక్కరు క్యారెక్టర్ కూడా చాలా హైలెట్ గా ఉంటుంది. నేను ఏదో పెద్ద తోపు సినిమా తీశానని చెప్పను కానీ మంచి సినిమా తీశాను అని అయితే కచ్చితంగా చెప్పగలనని అన్నారు. హీరోలు హరికృష్ణ, రామకృష్ణ మాట్లాడుతూ : ఈ సినిమా మా దగ్గర డబ్బు ఉంది కదా అని తీయలేదు సినిమా మీద మాకు ఉన్న ప్యాషన్ తో చేశాం, మా నాన్న మాతో ఈ సినిమా నేను మీకు ఒక స్టెప్పింగ్ లాగే చూపిస్తున్న, మీ కష్టంతో మీరు పైకి ఎదగాలి అని చెప్పారు. ఆయన మా పై పెట్టిన నమ్మకాన్ని నిలబెడతాం అలాగే మా బ్యానర్ పేరుని కూడా నిలబెడతామని అన్నారు.