Tamilanadu CM ViJay: రీల్ హీరో నుంచి రియల్ ముఖ్యమంత్రిగా విజయ్ తొలి స్పీచ్.. నాకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసు..
- రీల్ హీరో నుంచి రియల్ ముఖ్యమంత్రిగా విజయ్ తొలి స్పీచ్
- నిజాయితీ, పారదర్శకత, సామాజిక న్యాయం ఆధారంగా కొత్త శకం
- నేను మీ ఇంట్లో కుటుంబ సభ్యుడినే. మీ అన్నగా, తమ్ముడిగా ఉంటాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ముఖ్యమంత్రిగా తలపతి విజయ్ (సి. జోసెఫ్ విజయ్) ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తన మొదటి ప్రసంగంలో ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ‘విజయ్ మామా’ అని పిలువబడుతున్న ఆయన తన స్పీచ్‌లో కుటుంబ సభ్యుడిలా మాట్లాడుతూ, నిజాయితీ, పారదర్శకత, సామాజిక న్యాయం ఆధారంగా కొత్త శకం ప్రారంభమవుతుందని ప్రకటించారు. పిల్లలు ఆయన్ని ‘విజయ్ మామా’ అని పిలుస్తూ, ఎన్నికల్లో భారీ మద్దతు ఇచ్చారు. ఈ విజయం డబ్బు ఆధారిత రాజకీయాలకు చెక్ పెట్టి, నిజమైన సెక్యులర్ విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం ఆధారంగా కొత్త అధ్యాయం ప్రారంభించిందని విజయ్ ఉద్ఘాటించారు.
మొదటి ప్రసంగం
Also Read
- Kaziah Liz Mejo :ప్రపంచాన్ని ఏలేందుకు వెళ్తున్న కేరళ కుందెనపు బొమ్మ.. మిస్ యూనివర్స్ బరిలో 19 ఏళ్ల కజియా
- Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
- OBC Reservation : ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీం కీలక తీర్పు.. ఎవరికి వర్తిస్తుంది.?
- Karnataka: పెళ్లాం పుట్టింటికి వెళ్తోందని కక్ష.. భార్య, అత్తతో పాటు అత్తగారింటికి చెందిన ఏడుగురి హత్య
సెక్యులర్ విలువలు: “నేను అన్ని మతాలకు చెందినవాడిని. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ – అన్ని మతాలు మన మతాలే. ఎలాంటి రాజకీయ ఒత్తిడికి లొంగి సెక్యులర్ స్టాండ్‌ను వదలను” అని విజయ్ స్పష్టం చేశారు. అన్ని మతాల ప్రార్థనా స్థలాలను సందర్శించి, ఏకతా సందేశం ఇచ్చారు.
సామాజిక న్యాయం: డ్రావిడియన్ మోడల్‌ను మరింత నిజమైన రూపంలో అమలు చేస్తామని, అందరికీ సమాన అవకాశాలు, విద్య, ఆరోగ్యం, సామాజిక సమానత్వం కోసం పని చేస్తామని వాగ్దానం చేశారు. అణగారిన వర్గాలు, యువత, స్త్రీల సమస్యలపై ప్రాధాన్యత ఇస్తామన్నారు.
ప్రజా సేవ: “నేను ఎవరి జట్టుకూ చెందను, ప్రజల జట్టుకు చెందినవాడిని. ఈ విజయం ప్రజల విజయం” అని ప్రకటించారు. ఎన్నికల్లో ఎదురైన వ్యతిరేకత, అపవాదులను అధిగమించి, ప్రజల ప్రేమతో ఈ విజయం సాధించామన్నారు.
కొత్త యుగం: డబ్బు, కులాలు, మతాల రాజకీయాలు ముగిశాయని, నిజమైన మార్పు, పారదర్శకత, యువత ఆధారిత పాలనతో కొత్త తమిళనాడును నిర్మిస్తామని ప్రకటించారు.
ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ..”నేను మీ ఇంట్లో కుటుంబ సభ్యుడినే. మీ అన్నగా, తమ్ముడిగా ఉంటాను. నాకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసని అన్నారు. రాజకీయాల్లోకి వస్తే మేము చూసుకుంటామని మీరంతా ప్రేమగా పిలిచారు. నేను మీకు హామీ ఇస్తున్నాను. అది చేస్తాం.. ఇది చేస్తాం అని అబద్ధాలు చెప్పను. ఏదీ సాధ్యమో అది మాత్రమే చేస్తాను.. నాతో ప్రయాణం చేస్తున్న మిమ్మల్ని మోసం చేయను.. తమిళనాడులో ఇప్పుడు కొత్త శకం ప్రారంభమైంది.. నా ప్రభుత్వంలో ఒక్కటే పవర్ సెంటర్ ఉంటుంది.. చిన్నారులకు మామగా అండగా ఉంటా.. ఇది అస్థిర ప్రభుత్వం కాదు.. వెన్నంటి ఉన్న యువతకు ధన్యవాదాలు.. మీ కలల్ని మీ విజయ్ మామ తీరుస్తాడు.. నన్ను అవమానించేవారున్నారు.. ఇబ్బంది పెట్టేవారు వస్తారు. వాళ్లంతా నాకు శ్రేయోభిలాషులే అని కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ తన ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తానని ప్రకటించారు.
తొలి సంతకాలు
ప్రజా సంక్షేమం దిశగా సీఎం విజయ్ తన మొదటి సంతకాలతోనే ప్రజల ఆశలను నెరవేర్చడం ప్రారంభించారు:
ఉచిత కరెంట్‌పై తొలి సంతకం
మహిళల భద్రతపై రెండో సంతకం
తమిళనాడులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
మహిళల భద్రత కోసం షీటీమ్స్ తరహాలో ప్రత్యేక విభాగం
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఈగల్ తరహా వ్యవస్థపై సంతకం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం విజయ్ సంతకం
తాజావార్తలు
-
Hyderabad: ప్రజాప్రతినిధులకే ‘టోకరా’.. నిత్య కిలాడీ బాలాజీ నాయుడు అరెస్ట్!
-
Kaziah Liz Mejo :ప్రపంచాన్ని ఏలేందుకు వెళ్తున్న కేరళ కుందెనపు బొమ్మ.. మిస్ యూనివర్స్ బరిలో 19 ఏళ్ల కజియా
-
Rice Price Fraud : తెలంగాణలో బియ్యం ధరల దోపిడీకి చెక్.. 370 కేసులు నమోదు
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
Illegal Mining : అక్రమ మైనింగ్‌కు చెక్.. ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!