Buttermilk vs Lassi: మజ్జిగ వర్సెస్ లస్సీ.. ఈ మండుటెండలో ఏది ఎక్కువ మేలు చేస్తుంది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Buttermilk vs Lassi: ఎండలు దంచికొడుతున్నాయి.. బయటకు వెళ్లాలి అంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి.. ఇక, వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా, హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎండ తీవ్రత పెరిగే కొద్దీ ప్రజలు చల్లని పానీయాల వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే ఆరోగ్యకరమైన సాంప్రదాయ పానీయాలైన మజ్జిగ, లస్సీ మాత్రం ఇప్పటికీ ప్రతి ఇంట్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. పెరుగుతో తయారయ్యే ఈ రెండు పానీయాలు రుచికరంగానే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలతో కూడా నిండి ఉంటాయి. కానీ మండే ఎండలో ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో చాలామందికి సందేహం ఉంటుంది.
మజ్జిగ.. శరీరానికి సహజ కూలింగ్ డ్రింక్
మజ్జిగలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పాటు కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో పొటాషియం, విటమిన్ బీ12 వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు లభిస్తాయి. ఇవి చెమట ద్వారా కోల్పోయిన ఖనిజాలను తిరిగి శరీరానికి అందిస్తాయి. మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా భారీ భోజనం తర్వాత వచ్చే ఎసిడిటీ, కడుపు మంట వంటి సమస్యలను తగ్గించడంలో మజ్జిగ చాలా ఉపయోగపడుతుంది. వేసవిలో వడదెబ్బ నుంచి రక్షణ కల్పించే సహజ రీహైడ్రేషన్ డ్రింక్‌గా కూడా ఇది పనిచేస్తుంది.
Also Read
- Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ 'పప్పు చకోడీలు'.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
లస్సీ.. శక్తినిచ్చే పోషక పానీయం
లస్సీ మజ్జిగతో పోలిస్తే చిక్కగా, కొద్దిగా బరువుగా ఉంటుంది. ఇందులో పెరుగు పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల ప్రోటీన్, కాల్షియం కూడా అధికంగా లభిస్తాయి. లస్సీ తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండిన భావన కూడా కలుగుతుంది. ఇక, తీపి లస్సీ గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే ఇందులో కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి ఇది పరిమితంగా తీసుకోవడం మంచిది. కండరాల పునరుద్ధరణ, ఎముకల బలానికి కూడా లస్సీ ఉపయోగపడుతుంది.
జీర్ణక్రియకు ఏది బెస్ట్..?
జీర్ణక్రియ పరంగా చూస్తే లస్సీ కంటే మజ్జిగే ఎక్కువ ప్రయోజనకరంగా భావిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా వేయించిన జీలకర్ర, నల్ల ఉప్పు, పుదీనాతో తయారు చేసిన మసాలా మజ్జిగ తాగితే జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. ఇక, లస్సీ జీర్ణం కావడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అందుకే దీన్ని ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రిపూట లస్సీ తాగితే బరువుగా లేదా మగతగా అనిపించే అవకాశం ఉంటుంది.
నిపుణులు ఏమంటున్నారు..?
* మండే ఎండలో శరీరం ఎక్కువగా నీటిని కోల్పోతున్నప్పుడు మజ్జిగ అద్భుతమైన ఎంపికగా పనిచేస్తుంది.
* ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.
* మీరు బరువు తగ్గించే డైట్లో ఉంటే మసాలా మజ్జిగ ఉత్తమ ఎంపిక.
* వ్యాయామం తర్వాత శక్తిని అందించే పోషక పానీయం కావాలంటే లస్సీ తీసుకోవచ్చు.
మొత్తానికి శరీరానికి తేమను అందించడంలో మజ్జిగకు, పోషకాలను అందించడంలో లస్సీకి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. మీ ఆరోగ్య అవసరాలు, జీవనశైలిని బట్టి సరైన పానీయాన్ని ఎంచుకోవడం మంచిది.
తాజావార్తలు
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
AP SEC: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లకు NOC, నో డ్యూ సర్టిఫికెట్లు అవసరం లేదు..!
-
Saudi Arabia: అప్పు చేసి సౌదీకి వెళ్లిన బంగ్లాదేశీ మహిళ.. చివరకు మరణశిక్ష!.
-
CM Chandrababu Naidu: వారం రోజులే గడువు.. క్షేత్రస్థాయికి వెళ్లండి, ప్రజల్లో ఉంటే తిరుగుండదు..! నేతలకు సీఎం కీలక ఆదేశాలు..
-
Rudravanam : తల లేని మృతదేహం.. గుండెలు జలదరించే మిస్టరీ: ‘రుద్రవనం’లో దాగున్న ఆ భయంకరమైన రహస్యాలేంటి?
ట్రెండింగ్
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..