VIJAY : తమిళనాడు CMగా విజయ్ ప్రమాణస్వీకారం.. కానీ కొడుకు, కూతురు ఎక్కడ.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దళపతి విజయ్ తన సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని పక్కన పెట్టి రాజకీయాల్లో సంచలన విజయం సాధించి నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన ఈ వేడుకకు వేలాదిగా అభిమానులు, సినీ మరియు రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ఆ పార్టీ నేతలు విజయ్ కు అభినందనలు తెలిపారు.
అయితే ఇంతటి చారిత్రాత్మక ఘట్టంలో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ఎక్కడా కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన తండ్రి రాష్ట్రానికే ముఖ్యమంత్రి అవుతున్న వేళ కొడుకుగా ఆయన పక్కన ఉండి అభినందనలు తెలుపుతారని అందరూ భావించారు. కానీ స్టేడియంలో కానీ ప్రమాణ స్వీకార వేదికపై కానీ జాసన్ జాడ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా విజయ్ మరియు ఆయన భార్య సంగీత మధ్య మనస్పర్థలు రావడం, వీరిద్దరూ విడాకులకు అప్లై చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో జాసన్ సంజయ్ తన తల్లి సంగీతకు అండగా ఉన్నాడు. ప్రస్తుతం సంగీత లండన్‌లో ఉంటుండగా కుమారుడు జాసన్ కూడా తల్లితోనే ఉంటున్నాడు. కేవలం ప్రమాణ స్వీకారమే కాకుండా ఎన్నికల్లో విజయ్ ఘనవిజయం సాధించినప్పుడు కూడా జాసన్ సోషల్ మీడియా ద్వారా కనీసం అభినందనలు కూడా తెలపలేదు. కుటుంబపరమైన విబేధాల వల్లే ఆయన తండ్రికి దూరంగా ఉంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే విజయ్ కూతురు దివ్య సాషా కూడా కొంత కాలంగా తల్లి సంగీతతోనే ఉంటోంది. ఒకవైపు ముఖ్యమంత్రిగా విజయ్ కొత్త బాధ్యతలు చేపడుతున్న తరుణంలో విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ పరిణామాలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
Also Read
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
- Live In Relationships: సహజీవనం వివాహంతో సమానమే.. జంటలకు హైకోర్టు భరోసా
తాజావార్తలు
-
Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
-
PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ ‘ఆన్లైన్ ఫిర్యాదుల’ అస్త్రం.!
-
Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
-
Live In Relationships: సహజీవనం వివాహంతో సమానమే.. జంటలకు హైకోర్టు భరోసా
-
Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్‌స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?