Hyderabad Liquor Scam: బ్రాండెడ్ మందు బాబులకు షాక్.. ప్రీమియం లిక్కర్లో చీప్ లిక్కర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Liquor Scam: ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సికింద్రాబాద్ టీం లిక్కర్ మిక్సింగ్ ముఠా గుట్టు రట్టు చేసింది. “మామూలు లిక్కర్ తాగితే ఏముంటుంది అన్నా.. ప్రీమియం బ్రాండెడ్ లిక్కర్ తాగితే మంచి కిక్ వస్తుందన్నా.. ప్రీమియర్ లిక్కర్ కూడా మనకు మామూలు లిక్కర్ ధరలోనే మనకు లభిస్తుంది.” అంటూ నమ్మ బలికి ప్రీమియం లిక్కర్లో సాధారణ లిక్కర్ కలిపి ఫంక్షన్లలోనూ తెలిసినా.. బడా బాబులకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్న ఒక ముఠాను ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సికింద్రాబాద్ టీం సీఐ సావిత్రి సౌజన్య సిబ్బందితో కలిసి పట్టుకున్నారు..
లిక్కర్ మిక్సింగ్ జరుగుతుందనే పక్కా సమాచారం మేరకు సికింద్రాబాద్ ఎక్సైజ్ డీటీఎఫ్ సీఐ సావిత్రి సౌజన్య, టీం సిబ్బంది కలిసి రసూల్‌పుర మెట్రో స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల వద్ద ఆరు చివాస్ రీగల్ (Chivas Regal) లిక్కర్ బాటిల్ లభించాయి. వాటిని పరిశీలించగా ప్రీమియం లిక్కర్ బాటిల్లో తక్కువ ధర కలిగిన మద్యం మిక్సింగ్ చేసినట్లుగా ఎక్సైజ్ సిబ్బంది గుర్తించారు. ఈ విషయంపై నిందితులను ప్రశ్నించినప్పుడు.. అసలు విషయం వెల్లడించారు. దీంతో మిక్సింగ్ లిక్కర్ తయారీ ప్రాంతానికి నిందితులతో కలిసి టీమ్ సభ్యులు వెళ్లారు. లిక్కర్ మిక్సింగ్ ప్రాంతంలో 41 చివాస్ రీగల్ (Chivas Regal) ఫుల్ బాటిల్స్ ఉన్నాయి. అంతేకాదు.. మిక్సింగ్ మద్యం నింపడానికి సిద్ధం చేసిన వివిధ రకాలైన హై క్వాలిటీ ప్రీమియం లిక్కర్ బాటిల్స్ 63 లభించాయి. చివరకు రూ. 25 వేల విలువ కలిగిన రాయల్ సెల్యూట్ లాంటి మద్యం బాటిల్‌ని సైతం ఈ ముఠా మిక్సింగ్ మద్యంతో నింపి అమ్మకాలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్టు ఎక్సైజ్ విచారణలో వెల్లడైంది. మిక్సింగ్ లిక్కర్ దందా ముఠాలో చికున్ స్వాయిన్, సోను మహంతి, ప్రపుల్ కుమార్ నాయక్ ఉన్నట్లు సికింద్రాబాద్ డిటిఎఫ్ ఎక్సైజ్ సిబ్బంది గుర్తించారు. ఈ కేసులో చికున్ స్వాన్, సోను మహంతులను అరెస్ట్ చేశారు. ప్రపుల్ కుమార్ నాయక్ పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ సూపరిండెంట్ పంచాక్షరి, ఏఈఎస్ శ్రీనివాసరావు తెలిపారు.
Also Read
- Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
తాజావార్తలు
-
Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!