Sridevi Sisters: అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించిన రికార్డ్ శ్రీదేవిది. ఇక శ్రీదేవికి కజిన్స్ మొత్తం నలుగురు ఉన్నారన్న విషయం తెల్సిందే. అందరికి శ్రీదేవి చెల్లెలు మహేశ్వరి మాత్రమే తెలుసు. కానీ, శ్రీదేవికి వరుసకు చెల్లెళ్లు అయ్యేవారు మరో ముగ్గురు ఉన్నారు. వారే నగ్మా, జ్యోతిక, రోషిణి. చిన్నతనం నుంచి శ్రీదేవి, వారిని కూడా తన సొంత చెల్లెళ్లుగానే చూసుకుంది. ఇక వీరందరూ కూడా హీరోయిన్లుగా చేసినవారే. ముఖ్యంగా వీరందరూ నటించిన ఏకైక హీరో మన మెగాస్టార్ చిరంజీవి. శ్రీదేవి- చిరంజీవి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ జగదేక వీరుడు- అతిలోక సుందరి. ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక శ్రీదేవి తరువాత అంతటి హాట్ కాంబో అంటే.. చిరంజీవి- నగ్మా. వీరిద్దరి కాంబోలో దాదాపు మూడు సినిమాలు వచ్చాయి. ఘరానా మొగుడు, రిక్షావోడు, ముగ్గురు మొనగాళ్లు.. మూడు సూపర్ హిట్స్. ఇక నగ్మా పెద్ద చెల్లి రోషిణి.. వీరి కాంబో లో వచ్చిన చిత్రం మాస్టర్. తిలోత్తమా అంటూ చిరు.. రోషిని అందానికి ఫిదా అవుతాడు. ఈ సినిమా సూపర్ హిట్. ఇక రోషిణి తరువాత ఆమె చెల్లి జ్యోతిక.. ఈ కాంబో గురించి అందరికి తెల్సిందే. చిరు- జ్యోతిక జంటగా నటించిన చిత్రం ఠాగూర్. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్.. ఇలా శ్రీదేవి అక్కాచెలెళ్ళు అందరూ చిరుతో నటించారు. అయితే ఆ అవకాశం మహేశ్వరీకి మాత్రమే దక్కలేదు. ఇక తాజాగా ఈ అక్కాచెల్లెళ్లు అందరూ కలిసి దిగిన ఒక రేర్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.