దర్శకులు హీరోలకి అభిమానులైతే ఆ హీరోతో సినిమా చేసే సమయంలో చాలా ఫ్యాన్ మొమెంట్స్ ని సినిమాలో పెడుతూ ఉంటారు. హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’, కార్తీక్ సుబ్బరాజ్ ‘పేట’, లోకేష్ కనగారాజ్ ‘విక్రమ్’ ఇలాంటి సినిమాలే. ఒక ఫ్యాన్ గా తమ హీరోలని ఎలా చూడాలి అనుకుంటున్నారో తెలుసు కాబట్టి ఈ దర్శకులు అలానే సినిమాలు చేస్తారు. దర్శకులు అయితే సినిమాలు చేస్తారు మరి ప్రొడ్యూసర్స్ అయితే ఏం చేస్తారు? ఏముంది ఏ స్టేజ్ దొరికినా మైక్ పట్టుకోని అదిరిపోయే స్పీచ్ లు ఇస్తారు. అర్ధం కాలేదా? నిజం అండి ఒక ప్రొడ్యూసర్, ఒక హీరోకి ఫ్యాన్ అయితే చాలు, ఎప్పుడు ఎక్కడ మైక్ దొరికినా ఆ ప్రొడ్యూసర్ ఇరగదీసే రేంజులో స్పీచ్ ఇచ్చి తనలాంటి ఫాన్స్ లో జోష్ నింపుతూ ఉంటాడు. నమ్మకం లేదా? ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ స్పీచ్ లు చూడండి, పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ ఇచ్చే ఎలివేషన్స్ కన్నా బండ్లన్న ఎక్కువగా ఇస్తాడు. పవన్ సినిమా ఎలా ఉంటుంది? ఎవరితో చేస్తున్నాడు అనే విషయం కన్నా ప్రీరిలీజ్ ఈవెంట్ కి బండ్లన్న స్పీచ్ ఉందా లేదా అని ఎదురు చూసే అభిమానులే ఎక్కువ అనడం అతిశయోక్తి కాదేమో. ‘ఈశ్వరా, పరమేశ్వరా, పవనేశ్వరా’ అనే స్పీచ్ కానీ, ‘దేవరా’ అనే పదం కానీ, ‘మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్, మై గాడ్ ఈజ్… నాకంటే మీ బాగా తెలుసు’ లాంటి స్పీచ్ లతో బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ కి ఒక రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చాడు. అందుకే పవన్ కళ్యాణ్ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ కి బండ్ల గణేష్ వస్తున్నాడా లేదా అని టెన్షన్ పడే ఫాన్స్ చాలా మంది ఉన్నారు.
పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ ఎలానో సేమ్ అలానే అల్లు అర్జున్ కి కూడా ఒక డై హార్డ్ ఫ్యాన్ ఉన్నాడు అతనే ‘SKN’. ‘టాక్సీవాలా’, ‘బేబీ’ లాంటి సినిమాలని ప్రొడ్యూస్ చేసిన ‘శ్రీనివాస కుమార్’, అల్లు అర్జున్ కి చాలా పెద్ద ఫ్యాన్. సింపుల్ గా చెప్పాలి అంటే బన్నీ వాసు తర్వాత బన్నీ వాసు అంతటి వాడే SKN. అల్లు అర్జున్ గురించి మాట్లాడే వేదిక దొరికితే చాలు SKN మైక్ అందుకోని బన్నీ ఫాన్స్ కి గూస్ బంప్స్ వచ్చే రేంజులో ఎలివేషన్స్ ఇస్తాడు. పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ స్టార్ అంటూ బన్నీ గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు. ఇలాంటి సంఘటనే 18 పేజస్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో జరిగింది. నిఖిల్ హీరోగా నటించిన ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. ఈ స్టేజ్ పైన SKN మైక్ తీసుకోని, “పాన్ ఇండియా స్టార్” అంటూ స్పీచ్ మొదలు పెట్టాడు. పార్ట్ 2 రిలీజ్ అయితే పాకిస్తాన్, కజకిస్థాన్, రష్యాల్లో కూడా ఆడుతుంది, అప్పుడు పాన్ వరల్డ్ స్టార్ అంటాము అని SKN మాట్లాడాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న అల్లు అర్జున్, ఎలా రియాక్ట్ అవ్వాలో అర్ధం కాక బండ్లన్న మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ ఎలా నవ్వుతూ ఉంటాడో అచ్చం అలాగే SKN మాట్లాడుతుంటే బన్నీ కూడా నవ్వుతూ ఉండిపోయాడు. మొత్తానికి ఈ ఇద్దరు ప్రొడ్యూసర్స్ తమ హీరోలకి ఎలివేషన్స్ ఇస్తూ, మంచి స్పీచ్ లు ఇస్తూ ఫాన్స్ కి ఖుషి చేస్తున్నారు.