ఈ మధ్య సినీ స్టార్ హీరోలు, హీరోయిన్లు తమ క్రేజ్ ను వృధా చేసుకోకుండా సోషల్ మీడియా పై ఫోకస్ పెడుతున్నారు.. ఒకప్పుడు టీవీ లలో కనిపించే యాడ్ లలో కనిపిస్తూ డబ్బులను సంపాదించేవారు.. కానీ ఇప్పుడు టీవీ యాడ్స్ కంటే అత్యంత శక్తివంతంగా మారిపోయింది సోషల్ మీడియా ప్రొమోషన్స్. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ సైతం తమకి ఉన్న లక్షలాది ఫాలోయర్స్ కి రీచ్ అయ్యేలా కొన్ని ప్రొమోషన్స్ చేస్తున్నారు. అలా ప్రొమోషన్స్ చేస్తున్నందుకు కానీ ఆ బ్రాండెడ్ కంపెనీ కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్స్ ని కుమ్మరిస్తున్నారు. అలా ప్రొమోషన్స్ ద్వారా కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
దీపికా పదుకొనే :
బాలివుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే..సోషల్ మీడియాలో ఈమెకు ఫాలోయింగ్ ఎక్కువే.. ఒక్క ఇంస్టాగ్రామ్ లో సుమారుగా 74 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారట. ఈమె ఒక్కో యాడ్ ని ప్రచారం చేసేందుకు సగటున కోటి నుండి రెండు కోట్లు అందుకుంటుంది..
ప్రియాంక చోప్రా:
బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి వెళ్లిపోయిన ఈ బ్యూటీ కి ప్రస్తుతం యూత్ లో మామూలు క్రేజ్ లేదు. రీసెంట్ గానే ఈమె సిటాడెల్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ తో అమెజాన్ ప్రైమ్ ద్వారా మన ముందుకు వచ్చింది.. ఈ కూడా సోషల్ మీడియా ప్రమోషన్స్ కు గాను రెండు కోట్లు తీసుకుంటుంది..
కత్రినా కైఫ్ :
ఈ హాట్ బ్యూటీ కి యూత్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందిరికీ తెలిసిందే, పెళ్ళైన తర్వాత కూడా ఈమెకి క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. అలాగే ఇంస్టాగ్రామ్ తర్వాత తన అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటుంది. ఈమెకి దాదాపుగా 72 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు.. ఇక ఈ అమ్మడు కూడా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసం కోటి రూపాయలు అందుకుంటుంది..
అలియా భట్ :
ఈమెకి కూడా యూత్ లో మామూలు రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు,ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఈమెకి 77 మిలియన్ కి పైగా ఫాలోయర్స్ ఉన్నారు. రీచ్ కూడా ఈమె పోస్టులకు వేరే లెవెల్ లో ఉంటుంది.ఈమె ఒక్కో యాడ్ ని పోస్ట్ చేసేందుకు గానూ 1.5 కోట్ల నుండి 2 కోట్ల రూపాయిల వరకు అర్జీస్తుంది..ఒక్క బాలివుడ్ హీరోయిన్స్ మాత్రమే కాదు టాలివుడ్ లో సమంత, పూజా హెగ్డే లు కూడా సోషల్ మీడియా ద్వారా బాగానే డబ్బులను అందుకుంటున్నారు..