ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ రేంజ్ ఇమేజ్‌తో దేవర సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఎట్టిపరిస్థితుల్లోను కొరటాల శివ సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. జనతా గ్యారేజ్ తర్వాత అన్ని లెక్కలు పక్కకు పెట్టేసి ఊరమాస్‌గా పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా చేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్… అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎన్టీఆర్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో దేవర తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ టైగర్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. ఒక్క మాటలో చెప్పాలంటే… దేవర పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. పైగా ఆర్ఆర్ఆర్‌తో పాన్ ఇండియా స్టార్‌డమ్ అందుకున్నాడు ఎన్టీఆర్. మరి అలాంటి సినిమా థియేటర్లోకి వస్తుందంటే… పోటీగా మరో సినిమా వస్తే అంతకుమించిన రిస్క్ మరోటి ఉండదు కానీ దసరా సీజన్ కాబట్టి రెండు, మూడు సినిమాల రిలీజ్‌కు ఛాన్స్ ఉంది. అయినా కూడా దేవరతో పోటీ అంటే ఓపెనింగ్స్ విషయంలో తట్టుకోవడం కష్టమే కానీ నాగ చైతన్య మాత్రం దేవరతో సై అంటున్నాడు.
చందు మొండేటి డైరెక్షన్లో ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్‌గా ‘తండేల్’ చేస్తున్నాడు చైతూ. ఈ సినిమాకు అల్లు అరవింద్ భారీగా ఖర్చు చేస్తున్నాడు. దీంతో తండేల్ పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలా అని దేవరతో పోటీ పడితే… రిస్క్ తప్పదనే చెప్పాలి. తాజాగా దసరాకు తండే రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నామని… చందూ మొండేటి చెప్పుకొచ్చాడు. ఇంకా అఫిషీయల్‌గా డేట్ అనౌన్స్ చేయలేదు. ఒకవేళ గీతా ఆర్ట్స్ కాబట్టి థియేటర్ల లెక్కలు వేసుకొని రిలీజ్ చేస్తే… దేవర సౌండ్ ముందు ఫస్ట్ డే తండేల్ నిలబడడం కష్టమే. ఖచ్చితంగా… డే వన్ దేవర రికార్డ్ రేంజ్ ఓపెనింగ్స్ రాబడుతుంది. తండేల్‌కు హిట్ టాక్ వచ్చిన కూడా… ఆ తర్వాత రెండు మూడు రోజుల నుంచే కలెక్షన్స్ పెరుగుతాయి కాబట్టి… దేవరతో తండేల్ రిస్క్ చేస్తాడా? లేదా? అనేది చూడాలి.