ప్రభాస్, ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరికీ ఉన్న మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ‘బాహుబలి’తో ‘ప్రభాస్’ పాన్ ఇండియా స్టార్‌డమ్ సంపాదించుకోగా.. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగుపెట్టాడు. ఈ ఇద్దరికి ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతానికి ఈ ఇద్దరు ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. కానీ ఓ విషయంలో మాత్రం ఈ ఇద్దరు అస్సలు తగ్గేదేలే అంటున్నారు. ‘పోకిరి’లో పండుగాడు చెప్పినట్టు.. ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అన్నట్టుగా.. ఒక్కసారి కమిట్ అయితే ఎవ్వరిని పట్టించుకోరు ప్రభాస్, ఎన్టీఆర్. తమను నమ్మిన వారి కోసం ఎంత రిస్క్ చేయడానికైనా వెనకాడరు. కష్ట కాలంలో ఉన్న ఫ్యాన్స్ అయినా, ఫ్లాపుల్లో ఉన్న దర్శకులైనా సరే.. ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోరు. అందుకు నిదర్శనమే దర్శకులు కొరటాల శివ, మారుతి.
Also Read:Kannappa: కన్నప్ప’పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
మెగాస్టార్‌తో కొరటాల శివ చేసిన ‘ఆచార్య’ సినిమా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొరటాలతో ‘దేవర’ సినిమా చేశాడు ఎన్టీఆర్. అయితే.. ఆచార్య రిజల్ట్ వచ్చాక కొరటాలతో సినిమా అవసరమా? అనే కామెంట్స్ వచ్చాయి. కానీ తారక్ అవేవి పట్టించుకోలేదు. ఒక్క ఎన్టీఆర్ మాత్రమే కొరటాలను నమ్మాడు. ఫైనల్‌గా దేవర బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ‘మారుతి’ విషయంలోను ‘ప్రభాస్’ అదే చేశాడు. అసలు ప్రభాస్ స్టార్‌డమ్‌కు మారుతితో సినిమా ఏంటి? అని, మొదట్లో ‘రాజాసాబ్’పై చాలా నెగెటివ్ ట్రెండ్ చేశారు. కానీ ప్రభాస్ మాత్రమే మారుతిని నమ్మాడు. ఇదే విషయాన్ని మారుతినే స్వయంగా చెప్పుకొచ్చాడు. హీరో ‘గోపీచంద్’తో చేసిన ‘పక్కా కమర్షియల్’ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో ప్రభాస్‌తో సినిమా చేయాలనుకున్న ప్రొడ్యూసర్ డ్రాప్ అయ్యాడు. అలాంటి టైమ్‌లో నాకు సపోర్ట్‌గా నిలిచిన ఒకే ఒక వ్యక్తి ప్రభాస్. అందుకే ‘రాజాసాబ్’ ను ఒక సవాల్‌గా తీసుకున్నానని చెప్పుకొచ్చాడు. చెప్పినట్టే.. టీజర్‌తో అదరగొట్టేశాడు మారుతి. ఈ ఒక్క టీజర్ చాలు.. సినిమా హిట్ అవడానికి అనేలా చేశాడు. కాబట్టి.. ఎన్టీఆర్, ప్రభాస్ ఇద్దరు కూడా.. ఒక్కసారి ఎవరినైనా నమ్మారంటే.. ఎవ్వరెమన్నా సరే అస్సలు పట్టించుకోరు. సినిమా రిజల్ట్‌తోనే విమర్శించిన వారి నోర్లు ముయిస్తారు. దటీజ్ ‘ఎన్టీఆర్-ప్రభాస్’.