Kannappa: కన్నప్ప’పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు మోహన్ బాబు, మంచు విష్ణు నిర్మించి నటిస్తున్న కన్నప్ప సినిమాపై సనాతన ధర్మాన్ని, హిందూ దేవి దేవతలను, బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు మనోభావాలు దెబ్బతినే విధంగా చరిత్ర, పురాణాలు, వక్రీకరించి కన్నప్ప సినిమా నిర్మించారని బ్రాహ్మణ చైతన్య రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ఏపీ హైకోర్టులో రిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే వేసవి సెలవుల తరువాత హైకోర్టు నిన్ననే ప్రారంభమైంది. ఈరోజు 17 జూన్ మంగళవారం కన్నప్ప సినిమా కేసు ఏపీ హైకోర్టులో బెంచ్ మీదకి వచ్చింది. ఈ క్రమంలో సెంట్రల్ ఫిలిం బోర్డ్ ఆఫ్ సర్టిఫికేషన్ ముంబై తరఫున అడ్వకేట్ హాజరు కావడం జరిగింది. వారి తరపున ఉన్న అడ్వకేట్ కన్నప్ప సినిమా సెన్సార్ కాకుండా గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్ని అవరోధాలు అయినా సరే ఈనెల 27న సినిమా రిలీజ్ చేస్తామని తెలియజేసిన అంశంపై పత్రికల్లో వచ్చిన వార్తలను న్యాయస్థానం ముందు ఉంచారు.
Also Read:V. Hanumantha Rao: మోడీ బీసీ అయ్యుండి.. కుల గణన చేయడానికి ఆలోచిస్తున్నారు!
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
వెంటనే ఫిలిం సెన్సార్ బోర్డు పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా సెన్సార్ స్క్రూట్ని కూడా కాకుండా, సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా, హైకోర్టులో కౌంటర్ వేయకుండా సినిమా తేదీ ఎలా ప్రకటిస్తారని ప్రతివాది సెన్సార్ బోర్డ్ అడ్వకేట్ ను ప్రశ్నించారు. త్వరలో కౌంటర్ వేస్తామని సెన్సార్ బోర్డు పేర్కొంది. మిగిలిన ప్రతివాదులకు నోటీసులు అందినా ఎందుకు హాజరు కాలేదని, కౌంటర్ ఎందుకు వేయలేదని, కోర్టు, సెన్సార్ వారి అనుమతి లేకుండా సినిమా రిలీజ్ చేస్తే కోర్టు వారు చట్ట ప్రకారం ఏం చేయాలో అదే చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈనెల 27వ తేదీకి కన్నప్ప కేసును వాయిదా వేశారు. అదే రోజున ప్రపంచవ్యాప్తంగా కన్నప్ప సినిమా రిలీజ్ కానున్నట్టు ప్రకటించడం గమనార్హం.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?