Bhairavam : మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న మూవీ ‘భైరవం’. మే 30న ఈ సినిమా రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ బాగానే ఆకట్టుకుంది. పెద్ద ఎత్తున ఈవెంట్లు, ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు. విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తమిళ మూవీ మురుగన్ కు రీమేక్. అయితే ఇందులో నారా రోహిత్ వరద అనే మాస్ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా వరద పాత్రకు సంబంధించిన థీమ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో వరద పాత్ర మాస్ యాంగిల్ లో కనిపిస్తోంది.
Read Also : Nara Lokesh: సీఎం పదవిపై నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
ఎలాంటి సాఫ్ట్ కోణం లేకుండా.. ఊరమాస్ పర్ఫార్మెన్స్ లో కనిపిస్తున్నాడు. ఇందులో అతని పాత్ర కొంత వైలెంటింగ్ గా కూడా కనిపిస్తోంది. ఏదేమైనా నారా రోహిత్ ఇలాంటి పాత్రలో కనిపించి చాలా రోజులు అవుతోంది. ఇందులో ఊరిలో పెద్ద కుటుంబీకుడిగా కనిపించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా నారా రోహిత్ చేస్తున్న ఈ పాత్ర ఆయన కెరీర్ కు బెస్ట్ అని ఇప్పటికే మనోజ్ హైప్ ఇస్తున్నాడు. కాబట్టి నారా రోహిత్ ఈ పాత్రతో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాడో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత నారా రోహిత్ ఈ సినిమాతో రాబోతున్నాడు. ఈ మూవీతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తాడా లేదా అన్నది చూడాలి.
Read Also : VC Sajjanar: ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం..