ఛార్మితో 'మంత్ర', అనుపమా పరమేశ్వరన్ తో 'బట్టర్ ఫ్లై' చిత్రాలను నిర్మించిన జెన్ నెక్ట్స్ సంస్థ తాజాగా 'ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్' మూవీని నిర్మించింది. ఈ సినిమాతో రవి ప్రకాశ్ బోడపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
'కబాలి' ఫేమ్ సాయి ధన్సిక తెలుగులోనూ బిజీ అయిపోయింది. ఆమె నటించిన 'షికారు' గత యేడాది విడుదలైంది. ఇప్పుడు మరో రెండు మూడు మహిళా ప్రధాన చిత్రాలలో సాయి ధన్సిక నటిస్తోంది. అందులో ఓషో తులసీరామ్ రూపొందిస్తున్న 'దక్షిణ' షూటింగ్ పూర్తయ్యింది.