ప్రభాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ చిత్రానికి సంబంధించి టికెట్ ధరల పెంపు మరియు ప్రత్యేక షోలకు అనుమతినిస్తూ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానున్న ఈ సినిమా కోసం చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేసిన విన్నపాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించింది. జనవరి 8, 2026న సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల మధ్య ఒక ప్రత్యేక షోను ప్రదర్శించుకోవడానికి అనుమతి లభించింది. ఈ ప్రత్యేక షో కోసం ఒక టికెట్ ధరను గరిష్టంగా ₹1000 (జీఎస్టీతో కలిపి) గా నిర్ణయించారు. సినిమా విడుదలైన మొదటి 10 రోజుల పాటు (జనవరి 9 నుండి) సాధారణ టికెట్ ధరలపై అదనపు పెంపునకు అనుమతినిచ్చారు. సింగిల్ స్క్రీన్స్ లో ఒక్కో టికెట్‌పై ₹150 అదనంగా పెంచుకోవచ్చు. మల్టీప్లెక్స్ లలో ఒక్కో టికెట్‌పై ₹200 అదనంగా పెంచుకోవచ్చు. రోజుకు గరిష్టంగా ఐదు (05) షోలు ప్రదర్శించుకోవడానికి వెసులుబాటు కల్పించారు.
Also Read :Jana Nayagan: ‘జన నాయగన్’కు కోర్టు షాక్.. ‘రాజా సాబ్’ సోలో ఎంట్రీ!
ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు రావడంతో ప్రభాస్ అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు టికెట్ ధరల పెంపు మరియు స్పెషల్ షోల అనుమతి సినిమా వసూళ్లకు పెద్ద ప్లస్ కానుంది, ఈ నిర్ణయం కేవలం ‘రాజా సాబ్’కే కాకుండా, సంక్రాంతి బరిలో ఉన్న ఇతర పెద్ద సినిమాలకు కూడా సానుకూల సంకేతంగా మారుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ భారీ ఊరటతో ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది, మరి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటుందో లేదో వేచి చూడాలి.