The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Paradise: ‘దసరా’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కలిసి చేస్తున్న మోస్ట్ అవేటెడ్ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’. ఈ ప్రాజెక్ట్‌పై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకున్నాయి. సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ సూపర్ క్రేజ్ సంపాదించుకోగా తాజాగా ఒక ‘చిన్న లీక్’ అంటూ నాని పంచుకున్న వీడియో నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ స్టూడియో నుంచి స్వయంగా నాని పంచుకున్న ఆ చిన్న వీడియో క్లిప్‌తో సినిమాపై ఉన్న హైప్ ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది. ఈ చిత్రం నుంచి రాబోయే మూడో సింగిల్‌కు సంబంధించిన అప్డేట్ను నాని వినూత్నంగా రివీల్ చేశారు. “చిన్న లీక్.. అంజానా అంజాని (#AnjaanaAnjaani)” అంటూ ఆయన షేర్ చేసిన ఈ క్లిప్, సినిమాలో హీరో ‘జడల్ సుబ్బు’ ప్రేమకథను పరిచయం చేయబోతోందని స్పష్టమవుతోంది. రాక్‌స్టార్ అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ యూత్‌ను విశేషంగా ఆకట్టుకోనుందని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఆయా షేర్’, ‘ఏషనాగుల కట్టమీద’ పాటలు చార్ట్బస్టర్లుగా నిలిచి మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించగా, ఇప్పుడు రాబోతున్న ఈ మూడో సింగిల్ సినిమా మ్యూజికల్ చార్ట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లనుందని చెబుతున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) పతాకంపై ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తుండగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అత్యంత శక్తిమంతమైన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ (విక్రమ్ మాలిక్ పాత్రలో), సీనియర్ నటి సోనాలి కులకర్ణి, ఈశ్వరి రావు, సంపూర్ణేష్ బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరవేగంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ ప్రతిష్టాత్మక యాక్షన్ డ్రామాను 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటం, తాజా లీక్‌తో మూడో పాటపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Also Read
- Chiru Leaks: 'కాకా'లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
- BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
Chinna leak 🙂#AnjaanaAnjaani ♥️@anirudhofficial @odela_srikanth pic.twitter.com/ZPwOFyRnRA
— Nani (@NameisNani) September 20, 2026
తాజావార్తలు
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
-
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!