Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెజాన్ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన అతిపెద్ద ఫెస్టివల్ షేపింగ్ ఈవెంట్ అయిన ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 8వ తేదీ నుంచి ఈ భారీ పండుగ సేల్ ప్రారంభం కానుంది. స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ అప్లయన్సెస్, కిరాణా సరుకులు వంటి అనేక రకాల విభాగాలలో భారీ తగ్గింపులతో పాటు అద్భుతమైన ఆఫర్లను కస్టమర్లు పొందవచ్చు.
ఈ సేల్‌లో ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులు అలాగే అర్హత కలిగిన ఈఎంఐ లావాదేవీలపై కస్టమర్లకు ఇన్‌స్టంట్‌గా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ప్రైమ్ మెంబర్లకు సెలెక్ట్ ఆఫర్లపై అదనంగా మరో 10 శాతం వరకు ప్రత్యేక తగ్గింపు ప్రయోజనం ఉంటుందని కంపెనీ వెల్లడించింది. దీనితో పాటు కొత్త ప్రొడక్ట్ లాంచ్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆకర్షణీయమైన డీల్స్ కూడా అందుబాటులో ఉండనున్నాయి.
Also Read
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
పండుగ సీజన్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అమెజాన్ తన లాజిస్టిక్స్, డెలివరీ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా మరింత విస్తరించింది. భారతదేశం అంతటా కొత్తగా 20 ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, 6 సార్ట్ సెంటర్లు, 150 లాస్ట్-మైల్ డెలివరీ స్టేషన్లను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా.. సుమారు 400 నగరాల్లో తన ఆపరేషన్స్ నెట్వర్క్ ద్వారా 1,60,000 కంటే ఎక్కువ సీజనల్ ఉద్యోగ అవకాశాలను కల్పించినట్లు కంపెనీ తెలిపింది.
ప్రస్తుతం ఈ ఈకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో 17 లక్షలకు పైగా సెల్లర్లు ఉండగా, గడిచిన ఒక్క సంవత్సరంలోనే కొత్తగా 3 లక్షలకు పైగా విక్రేతలు ఈ నెట్‌వర్క్‌లో చేరారు. దీనిద్వారా దేశంలోని ప్రతీ కస్టమర్ కు అతి తక్కువ ధరలకే బెస్ట్ ప్రొడక్ట్స్ అందించేందుకు సన్నాహాలు చేసింది.
బ్లాక్‌బస్టర్ డీల్స్, టాప్ 100 డీల్స్, మెగా డీల్స్, రాత్రి 8 గంటల స్పెషల్ డీల్స్ వంటి ఆఫర్ల ద్వారా వినియోగదారులు ఏడాదిలోనే అత్యంత తక్కువ ధరలకు వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ‘బై మోర్ సేవ్ మోర్’, ఎక్స్ఛేంజ్ మేళా, సాంపుల్ మానియా వంటి ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి.
అంతేకాకుండా, దీపావళి నాటికి ‘అమెజాన్ నౌ’ సేవలను జలంధర్, తిరుపతి, వరంగల్, ధార్వాడ్, వెల్లూరు వంటి నాన్-మెట్రో నగరాలతో సహా మొత్తం 100 నగరాలకు విస్తరించనున్నట్లు కంపెనీ పేర్కొంది. దీనిద్వారా వినియోగదారులు నిత్యవసరాలు, తాజా పండ్లు, కూరగాయలు, చిన్న గృహోపకరణాలను గంటల వ్యవధిలోనే వేగంగా డెలివరీ పొందవచ్చు. ఈ పండుగ సీజన్లో వినియోగదారులకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందించేందుకు సర్వం సిద్ధమైంది.
తాజావార్తలు
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!