AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mega Cinemas: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త అధ్యాయానికి తెరలేవబోతోంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసే మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు థియేటర్ బిజినెస్‌లోనూ ప్రపంచ రికార్డును కొల్లగొట్టే భారీ వ్యూహంతో వేగంగా అడుగులు వేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ సంస్థ ‘ఏషియన్ సినిమాస్’తో చేతులు కలిపి హైదరాబాద్‌లో అసాధారణమైన మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్‌ను మెగాస్టార్ పట్టాలెక్కిస్తున్నారనే వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది స్క్రీన్ సైజ్. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్/సినిమా స్క్రీన్‌గా జర్మనీలోని ‘ట్రాంపలాస్ట్ లియోన్‌బెర్గ్’ థియేటర్ రికార్డుల్లో ఉంది. సుమారు 127 అడుగుల వెడల్పు, 69 అడుగుల ఎత్తుతో (దాదాపు 8,770 చదరపు అడుగులు) ఉన్న ఆ జర్మనీ రికార్డును బద్దలు కొట్టేలా హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో సరికొత్త స్క్రీన్‌ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ మెగా స్క్రీన్ పరిమాణం, ఉపయోగించే అత్యాధునిక సౌండ్, ప్రొజెక్షన్ టెక్నాలజీపై పూర్తి స్థాయి అధికారిక వివరాలు వెల్లడికావాల్సి ఉన్నప్పటికీ, హైదరాబాద్ నడిబొడ్డున గ్లోబల్ లెవల్ విజువల్ వండర్ రాబోతోందన్న వార్త ప్రస్తుతం సినీ ప్రేమికుల్లో పూనకాలు తెప్పిస్తోంది. ఏషియన్ సినిమాస్ ఇప్పటికే టాలీవుడ్ అగ్ర హీరోలతో కలిసి మల్టీప్లెక్స్ రంగంలో సూపర్ సక్సెస్ సాధించింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘AMB సినిమాస్’, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ‘AAA సినిమాస్’, రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ‘AVD సినిమాస్’ వంటి ప్రీమియం మల్టీప్లెక్స్‌లను నిర్మించి ప్రేక్షకులకు అద్భుతమైన సినిమా అనుభూతిని అందిస్తోంది. ఇప్పుడు అదే కోవలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి అడుగులు ముందుకు వేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుండటంతో మెగా అభిమానులు మస్త్ ఖుషీ అవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు ‘ఏషియన్ చిరంజీవి సినిమాస్’ (Asian Chiranjeevi Cinemas) లేదా ‘ఏషియన్ మెగాస్టార్ సినిమాస్’ (Asian Megastar Cinemas) అనే పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు ఇప్పటికే ప్రపంచ స్థాయి మల్టీప్లెక్స్ రాజధానిగా మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు గ్లోబల్ రికార్డును టార్గెట్ చేస్తూ మెగా భాగస్వామ్యంతో రాబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న ఈ భారీ మల్టీప్లెక్స్ నగరానికే మరో ప్రధాన ఆకర్షణగా మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. మెగాస్టార్ టీం నుంచి ఈ సంచలన ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే క్షణం కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
- Jr NTR: ‘NTRTAIN’తో కొత్త ఇన్నింగ్స్.. సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన జూనియర్ ఎన్టీఆర్?
- Akhil Akkineni : పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్ అక్కినేని?
- Mrunal Thakur and Yashasvi Jaiswal: మృణాల్ ఠాకూర్–యశస్వి జైస్వాల్ డేటింగ్..! వైరల్ వీడియోతో మొదలైన కొత్త చర్చ..
తాజావార్తలు
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!