The Kerala Story Breaks Records by 300 million streaming minutes on ZEE5: ది కేరళ స్టోరీ గతేడాది మే 5 న థియటర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదా శర్మ, యోగితా బలానీ, సిద్ది ఇద్నానీ, సొనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను సుదీప్తో సేన్ తెరకెక్కించాడు. కేరళలోని బాలికలను ఇస్లాం మతంలోకి మార్చి సౌదీకి తరలించారనే నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ది కేరళ స్టోరీ చిత్రం మొదలైనప్పటి నుంచి రిలీజ్ అయ్యేవరకు ఎన్నో వివాదాలు అలుముకున్నాయి, రిలీజ్ అయ్యాకా సినిమాను బ్యాన్ చేయాలనీ విమర్శలు వచ్చాయి. చాలా చోట్ల థియేటర్లకు ప్రేక్షకులను రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. తమిళనాడు వంటి చోట్ల బ్యాన్ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఇక ఈ మధ్యకాలంలో ఎంత స్టార్ హీరో సినిమా అయినా.. ఎంత హిట్ అందుకున్న సినిమా అయినా నెల తిరిగేలోపు ఓటిటీలో ప్రత్యేక్షమవుతుంది.
Vijay Deverakonda: దేవరకొండ సినిమాతో తమిళ్ స్టార్ హీరో వారసుడు టాలీవుడ్ ఎంట్రీ?
కానీ ఈ సినిమాను చాలా లేటుగా రిలీజ్ చేశారు. ఇటీవల ZEE5లో డిజిటల్ ప్రీమియర్ అయిన ఈ సినిమా ఏకంగా షాక్ కలిగించే విధంగా 300 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ కౌంట్ అయింది. డిజిటల్ రిలీజ్ అయిన రెండు వారాల్లోనే ఈ ఫీట్ సాధించబడింది. ఇది ఒక సంచలనం అని చెప్పొచ్చు. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ.. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఫిబ్రవరి 16 నుంచి అన్ని భాషల్లో ది కేరళ స్టోరీ స్ట్రీమింగ్ అవుతోంది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నానీ, దేవదర్శిని మరియు విజయ్ కృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్‌షైన్ పిక్చర్స్ పతాకంపై విపుల్ అమృతలాల్ షా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాఖ జ్యోతి, వీరేష్ శ్రీవల్స సంగీతం అందించారు.