The Ghost Trailer: అక్కినేని నాగార్జున- ప్రవీణ్ సత్తారు కాంబోలో తెరకెక్కిన చిత్రం ది ఘోస్ట్. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగార్జున సరసన సోనాల్ చౌహన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేసి చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే ఆద్యంతం ఆకట్టుకొంటుంది. నాగార్జున ఇందులో ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. చిన్నతనంలో అక్కను చూసుకోవాల్సిన బాధ్యతను తీసుకున్న విక్రమ్.. వారిని వదిలి హైదరాబద్ కు వచ్చేస్తాడు. చాలా ఏళ్ళ తరువాత అతని అక్కను, అక్క కూతురును మాఫియా ఎటాక్ చేస్తోంది. వారిద్దరిని కాపాడే బాధ్యతను విక్రమ్ తీసుకుంటాడు. అసలు మాఫియా వారిద్దరి వెనుక పడడానికి కారణం ఏంటి..? విక్రమ్ ఘోస్ట్ గా ఉంటూ వారిని ఎలా అంతమొందించాడు..? చివరికి వారిద్దరిని విక్రమ్ కాపాడాడా..? అనేది కథగా తెలుస్తోంది.
నాగ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు విక్రమ్ గా నాగ్ అదరగొట్టేశాడు. నాగ్ కు తోడుగా సోనాల్ కనిపించింది. మార్క్ కె రాబిన్ సంగీతం హైలైట్ గా నిలిచింది. మొత్తానికి నాగ్ నుంచి అభిమానులు ఏదైతే కోరుకొంటున్నారో అన్ని ఈ ట్రైలర్ లో ఉన్నట్లు తెలుస్తోంది. చావును చాలాసార్లు చాలా దగ్గర నుంచి చూశాను ప్రియా.. అంటూ నాగ్ చెప్పే డైలాగ్ ట్రైలర్ కే హైలైట్ గా నిలిచింది. మొత్తానికి ట్రైలర్ టోన్ సినిమాపై అంచనాలు పెంచేశాడు డైరెక్టర్. ఇక ఈ సినిమా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో నాగ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.