The Ghost: అక్కినేని నాగార్జున- ప్రవీణ్ సత్తారు కాంబోలో తెరకెక్కిన చిత్రం ది ఘోస్ట్. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో నాగ్ సరసన బాలయ్య భామ సోనాల్ చౌహన్ నటిస్తోంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేసిన చిత్రబృందం నేడు కర్నూల్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహిస్తోంది. ఇక ఈ వేడుకకు అక్కినేని నట వారసులు అక్కినేని నాగా చైతన్య, అక్కినేని అఖిల్ ముఖ్య అతిధిలుగా విచ్చేశారు. ఇక స్టేజీపై కొడుకులతో కింగ్ నాగ్ సందడి చేశారు. ఇద్దరు కుర్ర మన్మథుల మధ్య కింగ్ గ్రాండ్ ఎంట్రీ అదిరిపోయింది. ఈ ముగ్గురును చూస్తుంటే తండ్రి కొడుకులుగా ఈ మాత్రం అనిపించడంలేదంటే అతిశయోక్తి కాదు.
ముగ్గురు అన్నదమ్ములుగా ఉన్నట్లు కనిపించింది అంటున్నారు అక్కినేని అభిమానులు. ముఖ్యంగా అందరి చూపు అఖిల్ పైనే ఉందనే చెప్పాలి.ఏజెంట్ లుక్ లో బీస్ట్ గా అఖిల్ అదరగొడుతున్నాడు. జులపాల జుట్టు, దానికి తగ్గట్టు ఆ గడ్డం.. ఒక సరికొత్త లుక్ లో మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇక చైతూ సైతం ఉబర్ కూల్ గా కనిపించి మెప్పించాడు. ఇక కొడుకులకు తగ్గట్టు నాగ్ కూడా అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించి మెప్పించాడు. ప్రస్తుతం అక్కినేని హీరోల గ్రాండ్ ఎంట్రీ నెట్టింట వైరల్ గా మారింది.
https://www.youtube.com/watch?v=ZwPIT0YaXyU