ఈ ఏడాది ఆరంభంలో డాకు మహారాజ్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు బాలయ్య. ఒక స్టైలిష్ యాక్షన్ సినిమాతో ఆడియెన్స్ ను మెప్పించాడు. అదే జోష్ లో ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ చేస్తున్నాడు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు బాలయ్య. ఇటీవల హిమాలయాలలో అఘోరాకు సంబంధించిన కీలక సన్నీవేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని ఓ టాక్ అయితే టాలీవుడ్ సిర్కిల్స్ లో వినిపిస్తోంది.
Also Read : AamirKhan : ‘సితారే జమీర్ పర్’ ట్రైలర్ రిలీజ్..
ఇక బాలయ్య నెక్ట్స్ సినిమా గోపీచంద్ మలినేనితో చేస్తున్నాడు. బాలయ్య బర్త్ డే అనౌన్స్ మెంట్ రానుంది. అయితే ఇప్పుడు ఓ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కోలీవుడ్ లో అజిత్ కుమార్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ బాలయ్యను కలిసి ఓ పాయింట్ చెప్పాడట. అధిక చెప్పిన పాయింట్ కూడా బాలయ్యకు నచ్చిందని సమాచారం. రీసెంట్ గా అజిత్ ను ఫ్యాన్స్ కోరుకున్న విధంగా చూపించి భారీ హిట్ కొట్టాడు. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ బాలయ్యతో సినిమా చేస్తే మాస్ ఫీస్ట్ గ్యారెంటీ అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. అన్ని అనుకున్నట్టు జరిగితే ఆధిక్ తో బాలయ్య ఉండే ఛాన్స్ ఉందని, మరికొద్ది రోజుల్లో ఇంకో నేరేషన్ ఉండొచ్చని వినికిడి. బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సినిమను మైత్రి మూవీస్ నిర్మించనుంది.