నేచురల్ స్టార్ నాని ఓ వైపు దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్‌లో ‘హిట్-3’ సీక్వెల్ లో తో పాటు ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ‘ది ప్యారడైజ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో SLV బ్యానర్ పై చేరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఇది ఓ కాకుల కథ, జమానా జమానాలో నడిచిన శవాల కథ, రక్తం పోసి పెంచిన ఓ జాతి కథ, తల్వర్ పట్టుకున్న కాకుకులను ఒక్కటి చేసిన ఓ లం.. కథ, నాయకుడైన నా కొడుకు కథ అని చెప్తూ ది ప్యారడైజ్ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసారు మేకర్స్.
Also Read : Nabha Natesh : అబ్బా.. నభా..’నటేష్ సొగసులు శెభాష్’..
సరే ఈ సంగతి పక్కన పెడితే ఈ గ్లిమ్స్ ను ఇంత హడావిడిగా ఎందుకు రిలీజ్ చేసారు అసలు ఈ తతంగం ఏంటని ఆరా తీయగా ఓ విషయం తెలిసింది. సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే ది ప్యారడైజ్ సినిమా కోసం కొన్ని భారీ సెట్లు నిర్మించారు. ఒక్కోదాని ఖర్చు భారిగానే ఉంది. ఇక హీరో రెమ్యునరేషన్ లు దర్శకుడు రెమ్యునరేషన్స్ ఇతర ఇతర అమౌంట్స్ కలిపి ముందుగా అనుకున్న వంద కోట్ల బడ్జెట్ దాటేసిందట. ఇక ఇంతకు మించి పెట్టెలేనని ఏదైనా రిటర్న్స్ వస్తేనే బడ్జెట్ కేటాయించగలను అని నిర్మాత చెప్పేశాడట. దాంతో చేసేదేమి లేక ఓ చిన్న పాటి గ్లిమ్స్ రిలీజ్ చేసి సినిమాకు హైప్ తెచ్చి డిజిటల్ బేరాలు మొదలు పెట్టారు. మేకర్స్ ఊహించిన రేట్ కు అటు ఇటుగా రూ. 65 కోట్లు డిజిటల్ రైట్స్ డీల్ అవడంతో నిర్మాత కాస్త ఉపిరిపీల్చుకున్నాడు. బేసిక్ గా నాని సినిమాలను మంచి ధర పెట్టి కొనుగోలు చేసే నెట్ ఫ్లిక్స్ ప్యారడైజ్ లో నాని సరికొత్త మేకోవర్ లుక్ కు ప్రేక్షకుల్లో మంచి స్పందన రావడంతో భారీ రేట్ ఇచ్చింది. ఏదైతేనేం మొత్తానికి మేకర్స్ అనుకున్నదాని కంటే ఎకువుగానే రాబాట్ట గలిగారు. ఇక అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమా 26 మార్చి 2026న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.