టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSRMB. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా రానుంది రాజమౌళి సినిమా. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ నార్త్ లోని ఒడిశా రాష్ట్రంలో అవుట్ డోర్ షెడ్యూల్ షూట్ ముగిసింది. ఆ షూటింగ్ కు సంబంధించి కొన్ని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.
Also Read : Dragon Movie OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న బ్లాక్ బస్టర్ సినిమా
అయితే తాజాగా పృద్విరాజ్ సుకుమారన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పృద్వి రాజ్ సుకుమారన్ దర్శకుడిగా మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన సినిమా L2 ఎంపురాన్. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా బాలీవుడ్ మీడియాతో ముచ్చటిస్తున్న సందర్భంలో మీరు SSMB 29 సినిమాలో రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా షూట్ ఎలా జరుగుతుందని ప్రశ్నించగా అందుకు బదులుగా పృద్వి ‘ అవునా.. నిజామా. నేను మహేశ్ కలిసి జస్ట్ సైట్ సీన్ కోసం వెళ్లాం అని నవ్వతూ బదులిచ్చాడు. అలాగే ఒక సంవత్సర కాలంగా ఆ సినిమాపై వర్క్ జరుగుతుంది. ఒక మాస్టర్ క్లాస్ సినిమా రాబోతుందని, ఇంతకు మించి ఏమి మాట్లాడలేని అన్నాడు పృద్వి రాజ్. రాజమౌళితో సినిమా అంటే అయన అనుమతి లేనిదే ఏమి మాట్లాడలేరని రాజమౌళి కండిషన్ అలా ఉంటాయని జోక్స్ వేస్తున్నారు నెటిజన్స్.