Thank You Is a Life Journey : Dil Raju
అక్కినేని నాగ చైతన్య హీరోగా ఆదిత్య మ్యూజిక్ సంస్థతో కలిసి ‘దిల్’ రాజు నిర్మిస్తున్న సినిమా ‘థ్యాంక్యూ’ ఈ నెల 22న జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సోమవారం ‘దిల్’ రాజు మీడియాతో ఈ మూవీ గురించి ముచ్చటించారు. ఇప్పటి వరకూ తాను చేసిన ఏ సినిమాలనూ తన జీవితంలో పోల్చుకోలేదని, తొలిసారి ‘థ్యాంక్యూ’ మూవీతో పోల్చుకున్నానని ఆయన అన్నారు. ఈ మూవీ కథను బీవీఎస్ రవి నాలుగేళ్ళ క్రితం నెరేట్ చేశాడని, ఒక నార్మల్ కుర్రాడు, ఒక లెజెండరీ పర్శన్ అయ్యాక అతను మొత్తం నాది అని అనుకుంటాడని, కానీ అది నిజం కాదని తెలుసుకునే పాయింట్ తనకెంతో నచ్చిందని, సహజంగా ఎవరైనా జీవితంలో ‘థ్యాంక్యూ’ అనే పదాన్ని ఎక్కువగా వాడుతుంటారని, అందుకే ఆ పదాన్నే టైటిల్ గా పెట్టేశామ’ని అన్నారు. తన సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది తెలుసో, తెలియకుండానో సాయం చేశారని, సొసైటీకి తాను ‘దిల్’ రాజుగా కనిపించినా, ఆ వ్యక్తి వెనుక ఎంతో మంది హెల్ప్ ఉంటుందని ఆయన అన్నారు. అలా ఓ వ్యక్తి తన జర్నీని కాస్తంత ఆపి తన ఎమోషన్స్ ను, ఎదుటి వారి ఎమోషన్స్ ను గుర్తిస్తే ఎలా ఉంటుందన్నదే ఈ సినిమా అని, ఆ పాయింట్ కే తాను బాగా కనెక్ట్ అయ్యానని ‘దిల్’ రాజు చెప్పారు.
‘నాని ‘గ్యాంగ్‌లీడర్’ సినిమా ప్రివ్యూ చూడ్డానికి వెళ్ళినప్పుడు విక్రమ్‌కి ఈ పాయింట్ చెప్పానని, అతను ఎగ్జయిట్ అయ్యాడని, అతని స్టైల్ లోనే స్క్రీన్ ప్లే, సీన్స్ రాయమని కోరానని, 2019లో జరిగిందని అన్నారు. పేండమిక్ సమయంలో తాను కూడా థాంక్యూ జర్నీని స్టార్ట్ చేశానని, నాకు స్కూల్లో హెల్ప్ చేసిన వారిని, ఆటోమొబైల్స్ లో హెల్ప్ చేసిన వారిని అందరినీ కలిశానని, ఇంకా ఆ జర్నీ కంటిన్యూ చేయాల్సి ఉందని, యాభై సినిమాలు నిర్మించిన తాను పంపిణీదారుడిగానూ ఎంతో మంది సహకారం అందుకున్నానని, వారందరికీ ధ్యాంక్యూ చెప్పాల్సి ఉందని దానిని కంటిన్యూ చేస్తాన’ని అని అన్నారు. ఈ సినిమాను కొందరు ‘ప్రేమమ్’, ‘ఆటోగ్రాఫ్’ సినిమాలతో పోల్చుతున్నారని, ఆ రెండు లవ్ స్టోరీస్ కాగా, తమది లైఫ్ స్టోరీ అని జోరో నుండి ఓ వ్యక్తి హీరోలా ఎలా అయ్యాడనేది ఇందులో ప్రధానమని అన్నారు. విక్రమ్ తీసిన ‘ఇష్క్, మనం, 13 బి’ చిత్రాలు సక్సెస్ అయ్యాయని, అయితే ‘హలో’, ‘గ్యాంగ్ లీడర్’ చిత్రాలు ఎక్కడో ఆడియెన్స్ కు కనెక్ట్ కాలేదని చెప్పారు. అందుకే విక్రమ్ తో కలిసి తాను ఈ మూవీ మేకింగ్ సమయంలో జర్నీ చేశానని, 90 శాతం విక్రమ్ తమ అంచనాలను రీచ్ అయ్యారని తెలిపారు. చైతన్య ఇందులోని మూడు లుక్స్ కు పూర్తి న్యాయం చేశాడని, విక్రమ్, చైతన్య మధ్య ఉన్న కెమిస్ట్రీని కారణంగా అది సాధ్యపడింద’ని అన్నారు.