యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా బుజ్జి తల్లి సాంగ్ చాట్ బస్టర్ గా నిలిచింది. ఎక్కడ చూసిన ఈ పాటే ఇప్పుడు ట్రేండింగ్..
కాగా తండేల్ సూపర్ హిట్ అవుతుందని సినిమాను కింద సెంటర్స్ లో థర్డ్ పార్టీలకు హోల్ సేల్ గా ఇవ్వొద్దని కూడా నిర్మాతల నుండి డిస్ట్రిబ్యూటర్లకు సంకేతాలు అందాయని టాక్ వినిపిస్తుంది. అంత నమ్మకంగా ఉంది టీమ్. కానీ అక్కినేని అభిమానులను ఓ విషయం మాత్రం కాస్త టెన్షన్ పెడుతుంది. కారణం డైరెక్టర్ చందు మొండేటి. ఈ దర్శకుడు అక్కినేని నాగ చైతన్యతో ప్రేమమ్,సవ్యసాచి అనే రెండు సినిమాలు తెరకెక్కించాడు. అందులో ప్రేమమ్ రీమేక్.. అది కూడా ఓ మోస్తరు హిట్ గా నిలిచింది. ఇక భారీ బడ్జెట్ భారీ హైప్ తో వచ్చిన సవ్యసాచి డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న ముచ్చటగా మూడవ సినిమా తండేల్. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అక్కినేని అభిమానులు. రియల్ గా జరిగిన కథ అయినప్పటికీ దాన్ని చందు మొండేటి తెరపై ఎలా మలిచాడనేది ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. సేంటిమెంట్ ను బ్రేక్ చేసి నాగ చైతన్య కు చందు ఎలాంటి హిట్ ఇస్తాడో రెండు రోజుల్లో తేలుతుంది.