సూపర్ స్టార్ మహేష్ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేసిన మూడో సినిమా గుంటూరు కారం. సంక్రాంతి సీజన్ లో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందించాడు. థమన్ గుంటూరు కారం సినిమాని ఏ టైమ్ లో ఒప్పుకున్నాడో కానీ అప్పటి నుంచి థమన్ ట్రోలింగ్ ఫేస్ చేస్తూనే ఉన్నాడు. ఓ మై బేబీ సాంగ్ కైతే సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. కుర్చీ మడతపెట్టి సాంగ్ విషయంలో కూడా థమన్ ట్రోలింగ్ ఫేస్ చేసాడు కానీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు “నేను త్రివిక్రమ్ అడిగి ఈ పాట చేయించుకున్నాం” అనే మాటని చెప్పడంతో థమన్ పై కాస్త కామెంట్స్ తగ్గాయి. అలా అనుకునేలోపే గుంటూరు కారం సినిమా రిలీజై థమన్ ని పూర్తిగా ఇరికించేసింది. గుంటూరు కారం సినిమాని చూసిన ఆడియన్స్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు.
థమన్ స్కోర్ సరిగ్గా కొట్టలేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభాస్ ఫ్యాన్స్ థమన్ పై దృష్టి పెట్టారు. ప్రభాస్-మారుతీ కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఇలాంటి సమయంలో ఈ ప్రాజెక్ట్ కి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు అనగానే రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా యాక్టివ్ అయ్యి సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ మారుతీ సినిమా స్టార్ట్ అయినప్పుడు కూడా ఫ్యాన్స్ ఇలానే చేశారు. మరి అభిమానులని దృష్టిలో పెట్టుకోని మేకర్స్ థమన్ కాకుండా ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ కి వెళ్తారా లేక థమన్ తోనే కంటిన్యూ అవుతారా అనేది చూడాలి.