యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన “రాధే శ్యామ్” చిత్రానికి హ్యాపెనింగ్ మ్యూజిక్ కంపోజర్ తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన సంగతి తెలిసిందే. “రాధే శ్యామ్” ఈరోజుశుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే కొంతమంది మాత్రం సినిమా స్లోగా ఉందని పెదవి విరుస్తున్నారు. అలాంటి వారికి కౌంటర్ ఇచ్చేలా ఉన్న ఓ హిలేరియస్ మీమ్ ను తమన్ షేర్ చేసి, ప్రభాస్ ఫ్యాన్స్ ను ఫిదా చేశారు. “స్లో అంటా… నువ్వు పరిగెత్తాల్సింది… అదిరింది మీమ్” అంటూ తమన్ ఆ మీమ్‌ను పంచుకున్నాడు. ప్రభాస్ అభిమానులు విస్తృతంగా రీషేర్ చేయడంతో థమన్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Read also : RadheShyam: మరోసారి ప్రభాస్ పై విరుచుకుపడ్డ ట్రోలర్స్.. ఆ విషయంలో జాగ్రత్త లేదా అంటూ
రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటించింది. జగపతి బాబు, కృష్ణంరాజు, ప్రియదర్శి, జయరామ్, భాగ్యశ్రీ, సత్యరాజ్ తదితరులు యూవీ క్రియేషన్స్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ రొమాంటిక్ డ్రామాలో భాగమయ్యారు. జస్టిన్ ప్రభాకరన్, తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇక “రాధేశ్యామ్” కలెక్షన్స్ సంగతేంటో చూడాలి మరి !
#BlockBusterRadheShyam ??????
— thaman S (@MusicThaman) March 11, 2022
Slowwwww antaaaaa … Nuvvvvuuu parrigethaaaalsindhiiiii ????
Adhirindhiiiii memmeee !! ?????? pic.twitter.com/SGW10l5w5h