దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారసుడు’, తమిళ్ లో ‘వారిసు’ పేరుతో రిలీజ్ అవుతున్న ఈ మూవీని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ మంచి జోష్ లో చేస్తోంది. సాంగ్స్, పోస్టర్స్ తో దళపతి విజయ్ ఫాన్స్ ని ఎంగేజ్ చేస్తూనే ఉంది. ఇప్పటికే ‘వారిసు’ నుంచి రెండు పాటలు బయటకి వచ్చి యుట్యూబ్ ని షేక్ చేశాయి. ముఖ్యంగా ‘థీ దళపతి’ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ‘రంజితమే’ సాంగ్ అయితే తమిళ్ తో పాటు తెలుగులో కూడా సూపర్బ్ వ్యూస్ రాబడుతోంది. ఇప్పుడు వారిసు ఆల్బం నుంచి మూడో సాంగ్ బయటకి వస్తోంది. ‘సోల్ ఆఫ్ వారిసు’ అంటూ బయటకి రానున్న ఈ మూడో సాంగ్ ని తెలుగులో రామజోగయ్య శాస్త్రి రాయగా, తమిళ వర్షన్ ని వివేక్ రాశారు. తెలుగు తమిళ భాషల్లో సింగర్ ‘చిత్ర’ ఈ సోల్ ఆఫ్ వారిసు సాంగ్ ని పాడింది. మదర్ అండ్ సన్ ఎమోషన్ తో ఈ సాంగ్ బయటకి రానుందని సమాచారం. ఈరోజు సాయంత్రం 5 గంటలకి ‘సోల్ ఆఫ్ వారిసు’ సాంగ్ రిలీజ్ కానుంది.
‘వారిసు’ నుంచి తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానున్న మొదటి పాట ఇదే కావడం విశేషం. ఇప్పటివరకూ ముందు తమిళ పాటని విడుదల చేసిన తర్వాత తెలుగు పాటని విడుదల చేశారు. ఇప్పుడు రెండు భాషల్లో ఒకేసారి సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు. ఇకపై వచ్చే ప్రతి అప్డేట్ ని ఇలానే రెండు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తే, తెలుగులో కూడా ‘వారిసు’ సినిమాపై హైప్ పెరుగుతుంది లేదంటే ఈ సినిమాని ఒక డబ్బింగ్ సినిమాగా చూసే ప్రమాదం ఉంది. తెలుగు, తమిళ్ తో పాటు హిందీలో కూడా ‘వారిసు’ సినిమాని రిలీజ్ చేస్తానని చెప్పిన దిల్ రాజు, ఇప్పటివరకూ నార్త్ లో ప్రమోషన్స్ ని మొదలుపెట్టలేదు. ‘వారిసు’ రిలీజ్ కి ఎక్కువ సమయం లేదు కాబట్టి చిత్ర యూనిట్, హిందీ ప్రమోషన్స్ పైన కూడా దృష్టి పెట్టాల్సి ఉంది.